పంజా తో కొత్త పవన్ కళ్యాణ్ ని పరిచయం చేస్తున్నా: నీలిమా
పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. పవన్ నటిస్తున్న ఈ సినిమాకి ఏ టైటిల్ పెడితే అది అభిమానులకు నచ్చుతుందో అని ..ముందు 'షాడో"అని తర్వాత 'కాళి", 'తిలక్", 'పవర్" అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ పవన్ మాత్రం నేను 'పంజా" విసురుతాను అంటున్నారు.
కాగా అటు నిర్మాతలు మాత్రమే కాదు ఇటు సెట్ లో చూసిన ఫ్యాన్స్ కూడా 'పంజా" సినిమాలో పవన్ గెటప్ కేక అంటున్నారు. మొన్న రాజమౌళి కూడా అదే మాట అన్నారు. ట్విటర్ లోకి కొత్తగా అడుగుపెట్టిన నిర్మాత నీలిమ అయితే కొత్త పవన్ కళ్యాణ్ ను పరిచయం చేస్తున్నాం అంటుంది. అలాగే ఈ సినిమాను తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తారంట.
ఈ సినిమాలో పవన్ సరసన సారాజేన్ దియాస్, అంజలి లవేనియా నటిస్తున్న విషయం విదితమే. 'షాడో" వర్కింగ్ టైటిల్ గా కన్ ఫమ్ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఎనౌన్స్ చేస్తారట. సో పవన్ ప్రేక్షకుల మీదకి 'పంజా" విసిరి మరీ తన ప్రతాపాన్ని చూపిస్తాడట. మొత్తానికి అభిమానులలో ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియసిటి క్రియేట్ చేయగలిగారు. మరీ పవన్ కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం రేపటి వరకూ వెయిట్ చేయాల్పిదే... స్టిల్స్ రిలీజ్ అయ్యాక అభిమానులు మాత్రమే కాదు మొత్తం సినీ ప్రేక్షక లోకం ఈ సినిమా కోసం ఎదురుచూస్తారని ఆశీద్దాం.


Click it and Unblock the Notifications











