"పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా బూతులు తిడుతూ వేధిస్తున్నారు"
పవన్ కళ్యాణ్ అభిమానులు తనను ఇంకా వేధిస్తున్నారని మహేష్ కత్తి అన్నారు. వాట్సాఫ్‌లో తనను వేధిస్తున్న వారి ఫోన్ నెంబర్, ఫోటోలను ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తికి ఆ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ కత్తిని బెదిరించిన విషయం మీడియాలో పెద్ద రచ్చయింది.
కొన్ని రోజుల తర్వాత ఈ వివాదం సమసిపోయింది. అయితే తనకు ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి వేధింపులు, బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయని తాజాగా మరోసారి మహేష్ కత్తి వాపోయారు.

బూతులు తిడుతున్నారు
పవన్ కళ్యాణ్ అభిమానులు తనను ఇంకా వేధిస్తున్నారని, బూతులు తిడుతూ వాట్సాఫ్, ఫేస్ బుక్‌లలో వేధిస్తున్నారంటూ... మహేష్ కత్తి సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

వారి నెంబర్లతో సహా...
ఆ మధ్య మహేష్ కత్తిని వేధించడానికి కొందరు ఆయన నెంబర్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఇపుడు అదే తరహాలో తనను వేధించిన వారి ఫోన్ నెంబర్ మహేష్ కత్తి ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు.

ఈ పరిణామాలకు కారణం ఏమిటి?
అసలు మహేష్ కత్తికి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య ఈ వివాదం ఏర్పడటానికి కారణం.... పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను తన రివ్యూల్లో మహేష్ కత్తి తీవ్రంగా విమర్శించడమే.

పొలిటికల్ విమర్శలతో ముదిరింది
పవన్ కళ్యాణ్ సినిమాలను మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని, ఆయన పొలిటికల్ జర్నీని కూడా మహేష్ కత్తి తీవ్రంగా విమర్శించారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు అభిమానులు మహేష్ కత్తిని టార్గెట్ చేయడంతో.... ఈ వివాదం మరింత ముదిరింది.


Click it and Unblock the Notifications











