twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ గారు.. థ్యాంక్స్: దాడిపై కత్తి, శంకర్ జోక్యం, అవసరమైతే మద్దతుగా వస్తా?

    |

    ఈ నెల 15తో రచయిత కోన వెంకట్ ఇచ్చిన డెడ్ లైన్ పూర్తవడంతో.. ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి పవన్ ఫ్యాన్స్ తో వివాదంపై మళ్లీ ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం కూడా ఆయన పలు టీవి చానెల్స్ డిబేట్స్‌లో పాల్గొన్నారు. టీవి9లో డిబేట్ తర్వాత 99టీవి చానెల్ ఆఫీస్ కు వెళ్తున్న క్రమంలో ఆయనపై కోడిగుడ్ల దాడి జరిగింది. దాడి అనంతరం కత్తి మీడియాతో మాట్లాడారు..

    Recommended Video

    మహేష్ కత్తిపై గుడ్లతో దాడి

    తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..

    <strong></strong>'కత్తి' పేరుతో కోట్లు.., కానీ చిల్లిగవ్వ కూడా!,ఆ కారణంతోనైనా ఇక మానేయాలి: ఏకిపారేసిన తమ్మారెడ్డి'కత్తి' పేరుతో కోట్లు.., కానీ చిల్లిగవ్వ కూడా!,ఆ కారణంతోనైనా ఇక మానేయాలి: ఏకిపారేసిన తమ్మారెడ్డి

    దాడి అనంతరం కత్తి స్పందన..:

    దాడి అనంతరం కత్తి స్పందన..:

    అసలేం జరిగిందో గ్రహించే లోపే తనపై దాడి జరిగిందని సంఘటన అనంతరం మహేష్ కత్తి మీడియాతో తెలిపారు. కారులో ప్రయాణిస్తూ మొబైల్ లో అప్ డేట్స్ చూసుకుంటున్న సమయంలో.. అటుగా వచ్చిన ఓ బైకర్ తన ముఖంపై కోడి గుడ్లు విసిరి పారిపోయాడని అన్నారు.

     'పవన్ కల్యాణ్ గారు థ్యాంక్స్':

    'పవన్ కల్యాణ్ గారు థ్యాంక్స్':

    'పవన్ కల్యాణ్ గారు మీరు మాట్లాడకండి.. మీ ఫ్యాన్స్ మాత్రం రెచ్చిపోతుంటారు.. థ్యాంక్యూ.. థ్యాంక్స్ ఫర్ దిస్..' అని ఆవేదన వ్యక్తం చేశారు కత్తి మహేష్.

     డ్రైవర్ స్పందన?:

    డ్రైవర్ స్పందన?:

    రోడ్డుపై టర్న్ తీసుకునే క్రమంలో తాను విండో డౌన్ చేశానని, ఇంతలోనే ఓ బైకర్ కారులోకి కోడి గుడ్లు విసిరి పారిపోయాడని కారు డ్రైవర్ తెలిపారు.

     దర్శకుడు ఎన్.శంకర్ జోక్యం?:

    దర్శకుడు ఎన్.శంకర్ జోక్యం?:

    టీవి9 వేదికగా జరిగిన డిబేట్‌లో దర్శకుడు ఎన్.శంకర్ మహేష్ కత్తితో మాట్లాడారు. ఎవరైతే దాడికి పాల్పడుతున్నారో వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన కోరారు. అవసరమైతే నీకు మద్దతుగా నేను కూడా వస్తానని భరోసా ఇచ్చారు.

     కేసు పెడతానన్న కత్తి;

    కేసు పెడతానన్న కత్తి;

    దర్శకుడు ఎన్.శంకర్ సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహేష్ కత్తి కూడా ఒప్పుకున్నారు. ఈ డిబేట్ అనంతరం కొండాపూర్ లో 99 టీవి చానెల్ వద్దకు వెళ్తుండగా ఆయనపై దాడి జరిగింది.

     ఎవరై ఉంటారు?

    ఎవరై ఉంటారు?

    మహేష్ కత్తిపై దాడి చేసిందెవరు? అన్న దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. అయితే నాలుగు నెలలుగా పవన్ ఫ్యాన్స్ తో వివాదంలో నలుగుతున్న నేపథ్యంలో.. వారే ఈ పనిచేశారని కత్తి ఆరోపిస్తున్నారు.

    ఓయూ హెచ్చరిక;

    ఓయూ హెచ్చరిక;

    కత్తి విషయంలో ఇప్పటికే పవన్ కల్యాణ్ కు హెచ్చరిక చేసిన ఓయూ జేఏసీ దాడిపై ఘాటుగా స్పందించింది. దాడిని ఖండించిన జేఏసీ.. శుక్రవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మలను తగలబెట్టాలని పిలుపునిచ్చింది.

    సినిమాలు ఆడనివ్వం:

    సినిమాలు ఆడనివ్వం:

    ప్రజాస్వామ్య సమాజంలో భౌతిక దాడులు అనాగరికమని జేఏసీ నేత రవి అన్నారు. కత్తిపై దాడి నేపథ్యంలో పవన్ కల్యాణ్ నటించిన ఏ సినిమాను తెలంగాణలో ఆడనివ్వబోమని హెచ్చరించారు.

    English summary
    The war between Kathi Mahesh and Pawan Kalyan fans is still continuing and both the parties are at striking ends with each other through their debates through both television and online.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X