అక్కడ ‘వకీల్ సాబ్’ విడుదలకు బ్రేక్: ఆ థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి.. భారీగా నష్టం జరిగే ప్రమాదం

సినీ స్టార్లు అందరికీ అభిమానులు ఉంటారు. కానీ, వారిలో కొందరికి మాత్రమే క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. ఆయన అభిమానులది ప్రత్యేకమైన శైలి అని అందరికీ తెలుసు. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా వాళ్ల స్పందన అంతే స్థాయిలో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ అందరిలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా అనే నానుడి ఉంది. ఇలాంటి ఫ్యాన్స్‌కు తమ బాస్ మూవీ రిలీజ్ అనుకున్న టైమ్‌కు చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు జరిగిన ఘటనలపై స్పెషల్ స్టోరీ!

చాలా కాలం తర్వాత.. లాయర్‌గా ఎంట్రీ

చాలా కాలం తర్వాత.. లాయర్‌గా ఎంట్రీ

దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన 'వకీల్ సాబ్'. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలు పోషించారు.

సుందరంగా ఏర్పాట్లు... జాతరలు స్టార్ట్స్

సుందరంగా ఏర్పాట్లు... జాతరలు స్టార్ట్స్

చాలా గ్యాప్ తర్వాత తమ బాస్ సినిమా వస్తుండడంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' మూవీ కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. థియేటర్లలన్నీ కళకళలాడిపోయేలా సుందరంగా తయారు చేశారు. ఫలితంగా పల్లెల నుంచి పట్టణాల వరకూ అన్ని చోట్లా జాతరను తలపించేలా ముస్తాబయ్యాయి వకీల్ సాబ్ థియేటర్లు.

ఇప్పటికే పడిన షోలు... పాజిటివ్ టాక్

ఇప్పటికే పడిన షోలు... పాజిటివ్ టాక్

తెలంగాణలోని ప్రధాన నగరాలతో పాటు ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ముందు రోజు అర్ధరాత్రి థియేటర్ యజామానులతో కలిసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' మూవీ స్పెషల్ షోలు ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఏప్రిల్ 9న ఉదయం 7 గంటలకు బెనిఫిట్ షోలు కూడా సిద్ధం చేసుకున్నారు. వీటికి ఏరియాలను బట్టి టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. అవన్నీ అప్పుడే అమ్ముడయ్యాయి.

ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్

ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కరోనా విజృంభిస్తోన్న వేళ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు వద్దని చెబుతూ వాటికి అనుమతి నిరాకరించింది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ షోలు పడకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం రాజకీయం చేసిందని ఆరోపిస్తూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

రద్దవడంతో థియేటర్లపై ఫ్యాన్స్ దాడులు

స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో.. అప్పటికే బుక్ అయిన సినిమా ప్రదర్శితం చేయలేమని చెబుతూ.. చాలా ప్రాంతాల్లో ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఫలితంగా 'వకీల్ సాబ్' ప్రదర్శితం అయ్యే థియేటర్లపై రాళ్ల దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.

Recommended Video

Vakeel Saab Shows Cancelled, Pawan Kalyan’s Fans Angry | Filmibeat telugu

టెక్నికల్ ఇష్యూ.. ఫర్నీచర్ ధ్వంసం చేసి

కొన్ని చోట్ల స్పెషల్, బెనిఫిట్ షోలు రద్దు అయితే.. మరికొన్ని ప్రాంతాల్లో మార్నింగ్ షోలు సైతం పడలేదు. టెక్నికల్ కారణాలు, ఫైనాన్సియల్ ఇష్యూస్ వల్ల 'వకీల్ సాబ్' విడుదల నిలిచిపోయింది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఉగ్రరూపం చూపిస్తూ ఆయా థియేటర్లలో ఫర్నీచర్ అంతా ధ్వంసం చేసేశారు. దీంతో ఆయా సినిమా హాళ్లకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X