Bheemla Nayak: ఏపీ ప్రభుత్వానికి పవన్ ఫ్యాన్స్ షాక్.. చందాలు వేసుకుని ఏ అభిమానులూ చేయని విధంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ ఒకటి. ఇద్దరు స్టార్ హీరోల కలయికలో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ఆరంభం నుంచే ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే కొంత కాలంగా ఈ సినిమా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ అత్యధిక థియేట్రికల్ బిజినెస్‌ను కూడా జరుపుకుంది. ఇలా విడుదలకు ముందే భారీ హైప్‌ను ఏర్పరచుకుని.. ఇప్పుడు 'భీమ్లా నాయక్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
Recommended Video

డానియెల్‌తో భీమ్లా నాయక్ ఫైట్
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రూపొందిన భారీ చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు డైలాగ్‌లను అందించాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే
విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పరచుకున్న ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులకు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న ‘భీమ్లా నాయక్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు బిజినెస్ జరిగింది.

భీమ్లా ఫీవర్.. గ్రాండ్‌గా విడుదల
దాదాపు విడుదలకు పది రోజుల ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ‘భీమ్లా నాయక్' మూవీ మేనియా కనిపిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలుపుకుని మొత్తంగా దీన్ని 2000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

భీమ్లా నాయక్‌కు అలాంటి టాక్
పవన్ - రానా కాంబినేషన్‌లో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీ మాస్ రివేంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఓవర్సీస్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి టాక్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

టికెట్ రేట్ల ఇష్యూతో చిక్కులు
భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ‘భీమ్లా నాయక్' సినిమా రిలీజ్‌కు రెండు రోజులు ముందే ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జీవో 35ని కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. టికెట్ రేట్లను పెంచకూడదని, బ్లాక్‌లో టికెట్లు అమ్మరాదని వెల్లడించింది. అయితే ఈ నెలాఖరు వరకే ఈ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీ ప్రభుత్వానికి ఫ్యాన్స్ షాక్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరిలో పవన్ కల్యాణ్ అభిమానులు భిన్నమైన వాళ్లు అని చెప్పుకుంటారన్న విషయం తెలిసిందే. అందుకు నిదర్శనంగానే ఇప్పుడు వాళ్లు ఓ వినూత్న పనికి శ్రీకారం చుట్టారు. గతంలో ఏ హీరో అభిమానులూ చేయని విధంగా హుందాగా వ్యవహరించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్‌ను ఇచ్చారు.

థియేటర్ల దగ్గర చందాలడిగి
భీమ్లా నాయక్ మూవీకి టికెట్ రేట్ల తగ్గింపు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు గుంటూరు జిల్లా మాచర్లలోని థియేటర్ల దగ్గర చందాలు వసూలు చేస్తున్నారు. టికెట్ రేట్ల వల్ల ఇబ్బందులు పడుతోన్న డిస్ట్రిబ్యూటర్లు వాటిని అందిస్తామని చెబుతున్నారు. ఇదే పద్దతిని ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఫ్యాన్స్ చేస్తున్నారు. దీంతో వాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


Click it and Unblock the Notifications











