HBD Pawan Kalyan: థియేటర్లలో పవన్ కల్యాణ్​ ఫ్యాన్స్ బీభత్సం.. జరిగిన నష్టం ఎంతంటే?

పవన్​ కల్యాణ్​.. ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో విజిల్స్ సౌండ్​ మోత మోగిపోతుంది. ఏ హీరో ఫంక్షన్​ అయినా సరే.. పవన్ కల్యాణ్​ అని పేరు వింటే చాలు.. రచ్చ రచ్చే. మెగాస్టార్​ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమయ్యాడు పవన్​ కల్యాణ్. తర్వాత తనదైన నటన, మ్యానరిజంతో అశేష అభిమానులను సంపాదించుకుని పవర్​ స్టార్​గా ఎదిగాడు పవన్ కల్యాణ్. ఇవాళ అంటే సెప్టెంబర్​ 2న ఈ పవర్​ స్టార్​ పుట్టినరోజు. ఇక ఆయన బర్త్​డేకు పవన్​ కల్యాణ్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. అయితే కొన్నిసార్లు అది పరిధి దాటుతుంటుంది. అందుకు ఉదాహరణే ఈ సంఘటనలు.

తగ్గని క్రేజ్​..

తగ్గని క్రేజ్​..

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​ ఆద్యంత తనదైన స్టైల్​తో, డ్యాన్స్​లతో, డైలాగ్​లతో, మ్యానరిజంతో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్నాడు. అశేష అభిమానగనాన్ని సంపాదించుకున్న స్టార్​గా పవన్​ కల్యాణ్​ నిలిచాడు. సినిమా హిట్​ అయన, ఫ్లాప్​ అయినా పవన్​ కల్యాణ్​కు ఉన్న క్రేజ్​ ఏమాత్రం తగ్గలేదు.

27 సినిమాలు..

27 సినిమాలు..

పవన్​ కల్యాణ్ చివరిగా నటించిన చిత్రం భీమ్లా నాయక్​. ఈ సినిమా వరకు ఇప్పటికి 27 సినిమాలు చేశాడు పవన్ కల్యాణ్​. అందులో విజయాలకంటే అపజయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయినా పవన్ కల్యాణ్​ క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. హిట్టు, ఫ్లాప్​లకు సంబంధం లేకుండా సినిమా సినిమాకు ఆయన మార్కెట్​ పెరుగుతూనే వచ్చింది. ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్న పవన్ కల్యాణ్ బర్త్​డే ఇవాళ.

ఫ్యాన్స్​ హంగామా..

ఫ్యాన్స్​ హంగామా..

ఆయన పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు అక్కడక్కడ ఘనంగా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆయన సూపర్​ హిట్​ మూవీ జల్సా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన ఫ్యాన్స్​ కొందరు బీభత్సం సృష్టించారు. వైజాగ్​లోని లీలా మహాల్​ థియేటర్​లో జల్సా మూవీ ఫస్ట్​ అండ్ సెకండ్​ షోను ప్రదర్శించారు. అయితే ఈ థియేటర్​లో పవన్​ కల్యాణ్​ ఫ్యాన్స్​ నానా హంగామా చేసినట్లు సమాచారం.

థియేటర్​ ధ్వంసం..

థియేటర్​ ధ్వంసం..

బీర్​ బాటిల్స్​ పగలకొట్టి స్క్రీన్​ చించేశారు. సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్​ సైతం డ్యామేజ్ చేశారు. పేపర్​ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్​ పరిస్థితి అద్వాన్నంగా తయారైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ థియేటర్​ యాజామాన్యం గగ్గోలు పెడుతోంది. సుమారు రూ. 20 లక్షల నష్టం వచ్చినట్లు సమాచారం. ఇదేకాకుండా మరో చోట ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

సౌండ్ సిస్టం సరిగా లేదని..

సౌండ్ సిస్టం సరిగా లేదని..

కర్నూల్​లోని శ్రీరామ థియేటర్​లో జల్సా సినిమా చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున వచ్చారు. అయితే థియేటర్​లో సౌండ్ సిస్టం సరిగా లేదని ఫ్యాన్స్​ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. సహనం కోల్పోయిన పవన్ ఫ్యాన్స్​ థియేటర్​పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో థియేటర్​ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు చేరుకుని పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X