ఏపీ సీఎం జగన్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్: ‘వకీల్ సాబ్’ థియేటర్‌పై రాళ్ల దాడి.. అక్కడ షోలు రద్దు!
చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'వకీల్ సాబ్' మూవీతోనే అతడు కమ్‌బ్యాక్ అవుతున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు ఘనమైన స్వాగతం పలకాలన్న పట్టుదలతో థియేటర్లను ముస్తాబు చేస్తున్నారు. ఫలితంగా పల్లెల నుంచి పట్టణాల వరకూ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ అభిమానులకు ఏపీ సర్కారు షాకిచ్చింది. దీంతో అక్కడ షోలు రద్దు అయ్యాయి. దీంతో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ వివరాలు మీకోసం!

నాయకుడిగా వెళ్లి.. లాయర్‌గా వస్తున్నాడు
దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. రీఎంట్రీ అంటే కొత్త కథతో వచ్చే పరిస్థితులు ఉన్నా.. పాత సినిమాను రీమేక్ చేస్తున్నాడు పవన్.

సినిమా కథ ఇదే.. ముగ్గురు కోసం పోరాటం
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేని ముగ్గురు సామాన్య యువతులకు అనుకోని విధంగా ఓ కష్టం వస్తుంది. ఇందులో భాగంగానే వాళ్లంతా ఓ కేసులో ఇరుక్కుంటారు. వాళ్లకు ప్రతికూలంగా మారుతోన్న టైమ్‌లో లాయరైన హీరో ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచి బాధిత యువతలను కాపాడేందుకు పోరాటం చేస్తాడు. ఇదే వకీల్ సాబ్ కథ. అంజలి, నివేదా థామస్, అనన్య ఆ మూడు పాత్రలను చేశారు.

రెండింటిలో లేని విధంగా... పవన్ రోల్ ఇలా
'వకీల్ సాబ్' ప్రకటించినప్పటి నుంచే దీనిపై ఆసక్తి ఏర్పడింది. రెండు భాషల్లో లేని విధంగా ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను ఎలివేట్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మోషన్ పోస్టర్, టీజర్, ఆ తర్వాత వచ్చిన సినిమాలోని పాటలతో అవన్నీ రెట్టింపయ్యాయి. ఇక, ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలు అమాంతం పెంచింది.

ఆ ప్రాంతాల్లో స్పెషల్.. బెనిఫిట్ షోలు ప్లాన్లు
తెలంగాణలోని ప్రధాన నగరాలతో పాటు ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ముందు రోజు అర్ధరాత్రి థియేటర్ యజామానులతో కలిసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' మూవీ స్పెషల్ షోలు ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఏప్రిల్ 9న ఉదయం 7 గంటలకు బెనిఫిట్ షోలు కూడా సిద్ధం చేసుకున్నారు. వీటికి ఏరియాలను బట్టి టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. అవన్నీ అప్పుడే అమ్ముడయ్యాయి.

అన్నింటినీ రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కరోనా విజృంభిస్తోన్న వేళ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు వద్దని చెబుతూ వాటికి అనుమతి నిరాకరించింది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ షోలు పడకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. కొన్ని చోట్ల మాత్రం ఈరోజు ఉదయం 7 గంటలకే బెనిఫిట్ షోలు ప్రదర్శితం అవుతున్నాయి.
Recommended Video
జగన్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్: థియేటర్‌పై రాళ్ల దాడి
స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు చేసిన జగన్ సర్కారుపై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా సీఎంను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల ఈ షోలు రద్దు అవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఫలితంగా 'వకీల్ సాబ్' ప్రదర్శితం అయ్యే థియేటర్లపై రాళ్ల దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











