సూటిపోటి మాటల నుండి విముక్తి : పవన్ ఫ్యాన్స్ హ్యాపీ!

By Bojja Kumar

హైదరాబాద్: ఏమయ్యా...మీ హీరో ఎటు పోయాడు? ప్రశ్నిస్తాం అంటూ అప్పుడు తెగ హడావుడి చేసాడుగా..? ఇపుడు జాడ లేకుండా పోయాడేంటి? మీ హీరోది ఆరంభ శూరత్వమేనా? అంటూ.... ప్రజల నుండి ఎదురవుతున్న సూటిపోటి మాటలకు ఎదురు చెప్పలేక కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇబ్బంది పడ్డారు.

ఆ విమర్శలతో బయట తలెత్తుకు తిరగలేని పరిస్థితిలో ఉన్న ఫ్యాన్స్‌కు త్వరలో ఉపశమనం కలుగనుంది. ఎందుకంటే 'జనసేన' పార్టీ కార్యకలాపాలపై పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ముందుకు సాగుతున్నారు. జనసేన పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ వద్ద జనసేన పార్టీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నామని, దీని పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆ పత్రికా ప్రకటనలో జనసేన కోరింది.

బీజేపీ, తెలుగుదేశం పార్టీలు గెలుపు తీరాలు అందుకోవడంలో పవన్ కళ్యాణ్ తనవంతు సాయం చేసారు. మిగతా వివరాలు స్లైడ్ షోలు...

ఆ పార్టీలు అలా...

ఆ పార్టీలు అలా...

అయితే అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా జాప్యం చేయడంతో పాటు....పుండుపై కారం చల్లినట్లు ధరలు విపరీతంగా పెంచాయని, దీనిపై సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొన్నా పవన్ కళ్యాణ్ లాంటి వారు స్పందించడం లేదని, ఆ ప్రభుత్వాలను ప్రశ్నించడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.

అందుకే మౌనం?

అందుకే మౌనం?

పవన్ కళ్యాణ్ ఇంతకాలం మౌనంగా ఉండటానికి కారణం ‘జనసేన' పార్టీకి ఇంకా అధికారిక గుర్తింపు దక్కకక పోవడమే అని పవన్ అంటున్నారు. ఎన్నికల కమీషన్ నుండి ‘జనసేన' పార్టీకి గుర్తింపు రాగానే మీడియా ముందుకు వస్తానని, అన్ని విషయాలు మాట్లాడతానని, పార్టీని బలోపేతం చేయడంపై, విస్తరించడంపై దృష్టి పెడతానని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలుస్తోంది.

ఫ్యాన్స్ సంబరాలు

ఫ్యాన్స్ సంబరాలు

ఈ పరిణామాల నేపథ్యంలో....మున్ముందు తమకు మంచి రోజులు వస్తాయని, పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల తరుపున పోరాడితే తమకు ఇక ఎవరితోనూ సూటిపోటి మాటలు పడాల్సిన అవసరం లేదని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

. రాజకీయాల్లోకి

. రాజకీయాల్లోకి

జనసేన పార్టీ కార్యకలాపాలు విస్తరిస్తే రాజకీయాల్లోకి వెళ్లి సేవ చేయాలని పలువురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X