»   » పవనిజం-ఫ్యాన్స్ హంగామా... (ఆడియో ఏర్పాట్ల ఫోటోలు)

పవనిజం-ఫ్యాన్స్ హంగామా... (ఆడియో ఏర్పాట్ల ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రారంభం కానుంది. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఆడియో వేడుక పాసులు సంపాదించి పవర్ స్టార్‌ను దగ్గర నుంచి రియల్‌గా చూద్దామని ఎంతో మంది అభిమానులు ఆశ పడ్డారు. అయితే పోలీసుల ఆంక్షల మేరకు పరిమిత సంఖ్యలోనే పాసులు జారీ చేయడంతో చాలా మంది అభిమానులు పాసులు దొరకక నిరాశలో కూరుకు పోయారు.

పాసులు దొరికిన వారు మాత్రం ఈ రోజు మధ్యాహ్న సమయానికే శిల్పకళా వేదిక వద్దకు చేరుకుని హంగామా చేయడం ప్రారంభించారు. చాలా మంది అభిమానులు పవనిజం టీషర్టులు ధరించి యునిక్ డ్రెస్ కోడ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేయడం గమనార్హం....స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు.

పవనిజం అంటే ఏమిటి?

పవనిజం అంటే ఏమిటి?

పవర్ స్టార్ అభిమానులంతా పవనిజం పేరుతో కొంత కాలంగా హంగామా సృష్టిస్తున్నారు. పవనిజం అంటే పవర్ స్టార్‌ మంచి గుణగణాలను ఫాలో అవడం. అభిమానులంతా పవనిజానికి మతం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. కొందరు అభిమానులైతే ఆయన్ను దేవుడిలా పూజిస్తుండటం గమనార్హం.

రాష్ట వ్యాప్తంగా పంపిణీ అయిన టీషర్టులు

రాష్ట వ్యాప్తంగా పంపిణీ అయిన టీషర్టులు

పవనిజం పేరుతో ఉన్న టీషర్టులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులకు పంపిణీ చేసారు. ఇప్పుడు అందరూ అవే టీషర్టులను ధరించి ఆడియో వేడుకకు హాజరు కావడం గమనార్హం. అభిమానులంతా పవర్ స్టార్‌కు జై కొడుతూ తమ అభిమానాన్ని చాటు కుంటున్నారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఆడియో వేడుక సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. పాసులు ఉన్న అభిమానులను క్యూ పద్దతిలో వచ్చిన వారిని వచ్చినట్లుగా శిల్పకళా వేదిక ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

నిర్మాత విజ్ఞప్తి

నిర్మాత విజ్ఞప్తి

నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ....పాసులు లేని వారు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడవద్దు, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసు శాఖ ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో మాత్రమే పాసులు విడుదల చేసాం. పాసులు లేని వారు టీవీల్లో కార్యక్రమాన్ని చూడాలి, పరిస్థితి అర్థం చేసుకుని మాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అన్నారు.

ఫ్యాన్స్ ధర్నా

ఫ్యాన్స్ ధర్నా

కాగా...పాసులు దొరకని అభిమానులు గురువారం హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదట ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెగా కుటుంబంపై అభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నామని, రక్తదానాలు చేసామని, అలాంటి తమకే పాసులు ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నించారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో జతకలిసి నిర్మిస్తున్నారు. మరో నిర్మాత భోగవల్లి బాపినీడు ‘అత్తారింటికి దారేది' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఫస్ట్ లుక్ కేక...

ఫస్ట్ లుక్ కేక...

అత్తారింటికి దారేది ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై అనూహ్య స్పందన సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ఈచిత్రం ట్రైలర్‌ను ఆన్ లైన్లో దాదాపు 10 లక్షల పైచిలకు వీక్షలు వీక్షించారు. దీన్ని బట్టి సినిమాపై ఏరేంజిలో అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్

మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్

సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఎలాంటి అభ్యంతర కర సీన్లకు తావు లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ఆయన తనదైన ప్రత్యేక శైలిని అనుసరించారు. ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని చెబుతున్నారు.

బాక్సాఫీసు బిజినెస్ కేక

బాక్సాఫీసు బిజినెస్ కేక

సినిమా విడుదలకు ముందే ‘అత్తారింటికి దారేది' చిత్రం బిజినెస్ అదిరి పోయింది. సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులు ముందస్తుగానే రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడమే ఈ పరిణామాలకు కారణం.

సినిమా విడుదల ఎప్పుడంటే..

సినిమా విడుదల ఎప్పుడంటే..

ఈ రోజు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమం జరుగబోతోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం అవడంతో అభిమాన సంఘాలకు ఇప్పటికే పాసులు అందాయి. అంతా ఆడియో వేడుక ప్రాంగణానికి చేరుకున్నారు. ఆగస్టు 7న సినిమా విడుదల కాబోతోంది.

English summary
Pawan Kalyan fans hungama at the audio launch venue for Attarintiki Daredi audio launch. BVSN Prasad, the producer of Atharintiki Daredhi, has planned to hold a grand event for its music release at Shilpa Kala Vedhika in Hyderabad today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu