మనల్ని టచ్ చేయాలంటే.. వాళ్లకు ప్యాంట్ తడిచిపోవాలి.. పవన్ కల్యాణ్‌తో ఫ్యాన్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మీడియా, సోషల్ మీడియాలో కొనసాగుతున్న దాడిపై అభిమానులు కలత చెందారు. దాంతో పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు కొందరు అభిమానులు జనసేన కార్యాలయానికి వెళ్లారు. ఆవేదనతో ఉన్న అభిమానులను పవన్ పలకరించారు. ఎలాంటి విద్వేషాలకు తావివ్వ వద్దని పవన్ నచ్చచెప్పారు.
తన తల్లి, తనపై శ్రీరెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన పవన్ శుక్రవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు మీడియా వాహనాలను ధ్వంసం చేయడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో అభిమానులు తమ నాయకుడు పవన్‌ను కలుసుకొన్నారు. ఈ సందర్బంగా వారి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చను ఓ టెలివిజన్ ఛానెల్ ఎక్స్‌క్లూజివ్ పేరిట ప్రసారం చేసింది.

నాకు ఎవరితో గొడవలు లేవు
ఎవరితోనూ నాకు గొడవలు లేవు. కొందరు కావాలనే నన్ను వివాదాల్లోకి లాగుతున్నారు. ఎవరో మన పిల్లలు కార్ల అద్దాలు పగులకొట్టారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వచ్చి నాతో మాట్లాడారు. గత ఎనిమిది నెలలుగా నన్ను టార్గెట్ చేస్తున్నారు.

నేనెలా బాధ్యుడిని అవుతా
ఇలా రెచ్చగొడుతూ నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఎవరో చేసిన గొడవలకు నేనెలా బాధ్యుడిని అవుతాను అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టానికి వ్యతిరేకంగా ఈ పనులు చేయవద్దు. చట్టానికి అతీతులు ఎవరూ కారు అని ఆయన అన్నారు.

ప్యాంటు తడిచిపోవాలి
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాటలకు ఆవేశంతో ఉన్న అభిమానులు అడ్డుతగిలారు. అయితే ఫ్యాన్స్‌ను పవన్ నచ్చచెప్పారు. కానీ అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. ఎవరైనా మనల్ని అనాలంటే ప్యాంటులు తడిచిపోవాలి అని అభిమానులు గట్టిగా అరిచారు.
సహనంతో భరిద్దాం
సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయాన్ని అభిమానులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే అలాంటి విషయాలకు దూరంగా ఉండాలని జనసేన అధినేత సూచించారు. మనల్ని ఎవరూ ఏమైనా అంటే వాటిని భరిద్దాం. భరించని రోజున మీకు నేను సూచనలు చేస్తాను. అప్పుడు వారితో తాడో పేడో తెల్చుకొందాం అని పవన్ అన్నారు.


Click it and Unblock the Notifications











