»   » ఇప్పటికైనా పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందా?

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెం.1 స్థానంలో కొనసాగుతున్న హీరో. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి పదిహేడు సంవత్సరాలవుతోంది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు పవన్ కళ్యాణ్.

నెం.1 స్థానం కేవలం నటుడిగానే కాదు....ఇతరులకు సహాయం గుణంలోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన వాడు లేడని అనేక సందర్బాల్లో నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్. కళాకారులకు సత్కారాలు, అవార్డులు ఎంతో సంతృప్తిని, ప్రత్యేక గుర్తింపును ఇస్తాయనేది జగమెరిగిన సత్యం.

అయితే పవన్ కళ్యాణ్‌కు మాత్రం వీటిపై పెద్దగా ఆసక్తి లేదనే చెప్పాలి. తన సినిమాల వల్ల అభిమానులు సంతృప్తి చెందితే చాలు, తన వల్ల నిర్మాత నాలుగు రాళ్లు వేనకేసుకుంటే చాలు అని ఆలోచించే రకం అని ఆయన సన్నిహితులు, అభిమానులు చెప్పే మాట. ఆయనకు ఇంట్రస్టు లేక పోయినా...ఆయన అభిమానులు, సన్నిహితులు మాత్రం ఆయనకు అవార్డుల రూపంలో గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ నెం.1 స్థానానికి చేరుకున్నా.....రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సినీ నంది అవార్డు ఆయనకు ఇప్పటి వరకు దక్కక పోవడం అభిమానులకు వెలితిగానే మిగిలిపోయింది. అయితే 'అత్తారింటికి దారేది' చిత్రంతో ఆయనకు తప్పకుండా నంది అవార్డు లభిస్తుందనే ఆశతో ఉన్నారు అభిమానులు. ఈ చిత్రంలో ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారనేది వారి అభిప్రాయం. మరి వారి ఆశ ఈ సారైనా నెరవేరుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.

English summary
The Nandi Awards is the highest award ceremony for excellence in Telugu cinema, Telugu Theater, Telugu Television, and Life time achievements in Indian cinema, presented annually by Government of Andhra Pradesh. Tollywood no.1 actor Pawan Kalyan didn’t bagged even a single Nandi award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu