పవన్‌ కల్యాణ్‌ ...మ్యారేజ్ సర్టిఫికేట్ ఫేక్?

By Srikanya

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌కు అస్ట్రేలియన్‌ యువతి అన్నా లెజ్‌నివాతో మూడో పెళ్లి జరిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రగడ్డలోని జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సెప్టెంబరు 30న రిజిస్టర్‌ మ్యారేజి జరిగినట్టు నమోదయ్యింది. ఈ మేరకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటోలు బయిటకు వచ్చాయి.అయితే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఫేక్ అని కొందరు పవన్ అభిమానలు అంటున్నారు. దానికి వారు ఆ సర్టిఫికేట్ లో కొన్ని లోపాలు చూపెడుతున్నారు. వారు ఎత్తి చూపేవి ఏమిటంటే...

Pawan kalyan fans Proved that, it is a fake certificate

1. మ్యారేజ్ ఆఫీసర్ అని ఉన్న చోట..ఆ ఆఫీసర్ ని అని తెలిపే ఆర్దరైజ్డ్ సీల్ ఉండాలి కదా అది లేదు.

2. పవన్ పెళ్లిచేసుకున్న అమ్మాయి పేరు అన్నా లెజ్‌నివా అని సర్టిఫికేట్ లో ఉంది. మరి మీడియాలో డానా మార్క్స్‌ అనే పేరు చెప్తున్నారేంటి

3. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ లో... KONIDAla Pawan Kalyan అని ఉంది. కానీ పవన్ పేరు KONEDAla Pawan Kalyan కదా ..ఇంటి పేరు తప్పు ఎలా వచ్చింది

4. గరవ్నమెంట్ సర్టిఫికేట్ లో స్పెల్లింగ్ మిస్టిక్స్ చోటు చేసుకోవు కానీ... bridegroom అని ఉండాల్సింది bridgroom అని ఉందేంటి

5. పవన్ కళ్యాణ్ సంతకం ...ఆయనది కాదు అని స్పష్టంగా తెలిసిపోతోంది.

6. మ్యారేజ్ సర్టిఫికేట్ లో... వారిద్దరి వివాహానికి సంభందించిన ఫోటో ఫ్రూప్ ఉండాలి..అది ఏది..

ఇవన్ని ఈ ప్రక్క ఫోటో చూసి అభిమానులు సందిస్తున్న ప్రశ్నలు.

ఇక మీడియాలో వచ్చిన వార్తలు ఏమిటంటే... పెళ్లి కోసం ఆగస్టు 30వ తేదీన పవన్‌ కల్యాణ్‌, అన్నా లెజ్‌నివా దరఖాస్తు చేసుకున్నారని సబ్‌ రిజిస్ట్రార్‌ బాసిత్‌ సిద్ధిఖీ తెలిపారు. నెల రోజుల తరువాత అన్నీ సవ్యంగానే ఉన్నాయని భావించి రిజిస్టర్‌ మ్యారేజి జరిపించామని చెప్పారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.... 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలైన రెండు రోజులకు బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 12లో ఉన్న పవన్‌ నివాసంలోనే వివాహ వేడుక జరిగినట్టు తెలిసింది. పవన్‌కి అత్యంత సన్నిహితులైన కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా పౌరురాలైన అన్నా లెజ్‌నివా ఓ మోడల్‌గా, నటిగా కెరీర్‌ని కొనసాగిస్తున్నట్టు తెలిసింది. పవన్‌, అన్నా లెజ్‌నివాలు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆ విషయాన్ని పెళ్లి కోసం సమర్పించిన అఫిడవిట్‌లోనూ పవన్‌ పేర్కొన్నారు. వీరిద్దరికీ ఓ పాప పుట్టినట్లు తెలుస్తోంది.

ఈ వివాహానికి సాక్షులుగా వ్యాపారులు మహ్మద్‌ అబ్దుల్‌ ఆరిఫ్‌, ఎన్‌.శ్రీనివాస్‌లతో పాటు ఆర్ట్‌ డైరెక్టర్‌ బి.అనంద్ లు సంతకాలు చేశారు. నోటీస్‌ నెం.50, మ్యారేజ్‌ నెం.43 కింద పవన్‌ కల్యాణ్‌ పెళ్లి నమోదయ్యింది. అన్నా లెజ్‌నివా విదేశీ యువతి కావడంతో స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ సెక్షన్‌-13 కింద ప్రత్యేక ధృవపత్రం జారీ చేశారు. ఇదిలా ఉంటే పవన్‌ కల్యాణ్‌కు విశాఖపట్నానికి చెందిన నందినితో తొలిసారి పెళ్లి జరిగింది. ఆమెతో విడాకులు తీసుకున్న అనంతరం రేణు దేశాయ్‌తో రెండో పెళ్లి అయ్యింది. ఈమె నుంచి కూడా పవన్‌ కల్యాణ్‌ వేరుపడినట్లు తెలిసింది. తాజాగా అన్నా లెజ్‌నివాను వివాహం చేసుకోవడం ఇప్పుడు సంచలనమయ్యింది.

పవన్‌ తో కలిసి 'తీన్‌మార్‌' చిత్రంలో నటించిన డానా మార్క్స్‌యే ఈ అన్నాలెజ్‌నివా అని ప్రచారం సాగుతోంది. అయితే, పెళ్లి రిజిస్ట్రేషన్‌ కోసం చేసుకొన్న దరఖాస్తులో ఉన్న అన్నా ఫొటోకీ, 'తీన్‌మార్‌'లో నటించిన డానాకీ పోలికలు లేవు. అయితే ఆ సినిమాలో అన్నా లెజ్‌నివా హీరోయిన్ గా కాకుండా, ఓ చిన్న సన్నివేశంలో మాత్రమే కనిపిస్తుందనే ప్రచారం కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X