twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవర్ స్టార్ వర్సెస్ పరాన్న జీవి.. ఆర్జీవిపై సెటైరికల్ మూవీ

    |

    రామ్ గోపాల్ వర్మ నిత్యం ఎవరి మీదో ఒకరి మీద సినిమాలు తీస్తూ డబ్బులు కూడ బెట్టుకుంటున్నాడు. తన ఒపినియన్ అంటూ తనకు నచ్చిన విధంగా సినిమాలను తీస్తూ వచ్చే వర్మపై ఓ వర్గం ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు. అయితే వర్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనకు తోచిన విధంగా సినిమాలను తీస్తూనే ఉన్నాడు. ఆ మధ్య అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానా హంగామా చేశాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పేరిట ఓ చిత్రాన్ని తీస్తున్నాడు. అలాంటి వర్మపై ఓ సెటైరికల్ మూవీ రాబోతోంది.

    ట్విట్టర్‌లో దూకుడు..

    ట్విట్టర్‌లో దూకుడు..

    ట్విట్ట‌ర్ ఉంది క‌దా.. అని ఏది ప‌డితే అది వాగేసి, ఎంత ప‌డితే అంత, ఎవ‌రిపై ప‌డితే వాళ్ల‌పై వర్మ సెటైర్స్ వేస్తుంటాడు. ఆత్మ క‌థ‌లు, ఆత్మ‌ల క‌థ‌లు తీసి, సొమ్ము చేసుకోవాల‌నుకోవ‌డం వ‌ర్మ వ్యాపార సూత్రం. పైగా వర్మకు మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్, గొడవల సంగతి అందరికీ తెలిసిందే.

     మెగా ఫ్యామిలీయే టార్గెట్..

    మెగా ఫ్యామిలీయే టార్గెట్..

    మెగా హీరోలను కామెంట్లు చేసే వర్మ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌పై పడ్డాడు. ప‌వ‌న్ అభిమానుల్లో, ప‌వ‌న్ ఇమేజ్‌నో, ప‌వ‌న్ పేరునో వాడుకోక‌పోతే.. పూట గ‌డ‌వ‌ని వ‌ర్మ ఇప్పుడు ప‌వ‌న్ పై సినిమా తీస్తున్నాడు. ఎప్ప‌టిలా జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు త‌క్కువ.. డూప్‌ల‌కు ఎక్కువ అనిపించే ఆర్టిస్టుల్ని వెద‌కి ప‌ట్టి - కేవ‌లం ప‌బ్లిసిటీతో జిమ్మిక్కుల చేసి, టికెట్లు అమ్ముకోవ‌డానికి వెంప‌ర్లాడిపోతున్నాడు.

     వర్మపై సెటైరికల్ మూవీ..

    వర్మపై సెటైరికల్ మూవీ..

    అయితే తమ హీరోను ఇలా కించపరుస్తుండటంతో పవన్ అభిమానులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ప‌వ‌న్ పై వ‌ర్మ సినిమా తీస్తుంటే.. వ‌ర్మ‌పై ప‌వ‌న్ అభిమాని ఓ సినిమా తీయ‌డమనేది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అయితే అప్పట్లో జొన్నవిత్తుల కూడా వర్మపై ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

    పోటాపోటీగా..

    పోటాపోటీగా..

    ప‌వ‌న్ గురించి వ‌ర్మ ఏం తీస్తాడో, ఎన్ని కాక్ అండ్ బుల్ క‌థ‌లు అల్ల‌బోతున్నాడో ఈజీగా ఊహించేయొచ్చు. కానీ.. వ‌ర్మ‌పై ప‌వ‌న్ అభిమాని ఎలాంటి సినిమా తీస్తాడనే ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. రాంగోపాల్ వ‌ర్మ అస‌లైన రంగు - రుచి - వాస‌న చెప్ప‌డానికి పరాన్న జీవి సినిమా రాబోతోంది. మ‌రి వీటిలో ఎవ‌రిది పైచేయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగితే స‌రిపోతుంది.

    English summary
    Pawan Kalyan Fans Satirical Movie On RGV is Paranna Jeevi. RGv Satirical Movie POWERSTAR Is Going Release Soon. For this Movie Couter Attack Is Pawan Kalyan Fans Making Paranna Jeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X