»   » ఫ్యాన్స్ తప్పక చదవాలి: లీఫ్ ఇయిర్ కు, పవన్ కెరీర్ కు లింక్

ఫ్యాన్స్ తప్పక చదవాలి: లీఫ్ ఇయిర్ కు, పవన్ కెరీర్ కు లింక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇదేంటి...పవన్ కళ్యాణ్ కు, లీఫ్ ఇయిర్ కు కనెక్షన్ ఏమిటీ అనుకుంటున్నారా..ఉందండోయ్. ఆయన కెరీర్ ని , సినిమాలను నిశితంగా అబ్జర్వ్ చేసే అభిమానులకు ఈ పోలిక స్పష్టంగా కనపడుతుంది.

నాలుగేళ్లకోసారి వచ్చే ఈ రోజు కొందరి జీవితాల్లో ప్రత్యేకమైంది. అలా పవన్ కెరీర్ లో కూడా ప్రత్యేకమైనంది. పవన్ కళ్యాణ్ అంటేనే హిట్స్, ఫ్లాఫ్ లకు అతీతంగా ఎదిగిన స్టార్. అయితే ఆ సూపర్ హిట్స్ , కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలు ఎక్కువగా వచ్చింది లీఫ్ ఇయిర్ లోనే అనే విషయం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నమ్మనంటారా..అయితే క్రింద స్లైడ్ షోలో ...ఆయన కెరీర్ లో లీఫ్ ఇయిర్ లో వచ్చిన సినిమాలు చూసి అప్పుడు డిసైడ్ చేసుకోండి.

నో మూడ్, ఏకాదశి ఇంకా... : 'గబ్బర్ సింగ్'...కొన్ని సీక్రెట్స్

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటున్నారు. ఈ సంవత్సరం కూడా లీఫ్ ఇయిర్ వచ్చింది. లీప్ ఇయర్... నాలుగేళ్లకోసారి పలకరించివెళ్తుంది. 365 రోజుల సంవత్సరంలోకి అదనంగా మరో ఇరవై నాలుగు గంటల్ని మోసుకొస్తుంది. అలా ఈసారి క్యాలెండర్‌లో కూడా అదనంగా ఓ రోజు చేరింది. అదే ఫిబ్రవరి 29. ఈ రోజు.

ఆ రోజులే వేరప్పా : పవర్ స్టార్ కాక ముందు పవన్ (రేర్ ఫొటోలు)

నాలుగేళ్లకోసారి వచ్చే లీప్‌డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు. ఈ వార్త చదివితే పవన్ ఫ్యాన్స్ కూడా. మీరు పవన్ ఫ్యాన్ అయితే తప్పకుండా చదివాల్సిందే మరి.

స్లైడ్ షోలో .. పవన్ కెరీర్ లో లీఫ్ ఇయిర్ లో వచ్చిన సినిమాల లిస్ట్...

అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి

అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి

పవన్ తొలి చిత్రం ఇవివి సత్యనారాయ దర్శకత్వంలో రూపొందిన అక్కడ అమ్మాయి అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 రిలీజైంది. అది లీఫ్ సంవత్సరమే.

బద్రీ

బద్రీ

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రం 2000లో రిలీజైంది. అదీ లీఫ్ ఇయిర్ కావటం విశేషం.

గుడుంబ శంకర్

గుడుంబ శంకర్

వీరశంకర్ దర్శకత్వంలో రూపొందిన గుడుంబా శంకర్...2004 లో విడుదలైంది. ఇదీ లీఫ్ ఇయిరే. ఇది పవన్ కళ్యాణ్ లో కామెడీని సంపూర్తిగా ఆవిష్కరించిన చిత్రం.

జల్సా

జల్సా

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన జల్సా ఎంత పెద్ద హిట్టో మనకందరికీ తెలిసిందే. ఈ సినిమా 2008లో విడుదలైంది. ఇదీ లీఫ్ ఇయిరే

గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ చిత్రం వరస ఫ్లాఫుల్లో ఉన్న పవన్ ని వాటినుంచి బయిటపడేసింది. ఈ సినిమా 2012లో విడుదలైంది. ఇదీ లీఫ్ ఇయిరే కావటం గమనించవచ్చు.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఈ సంవత్సరం అంటే 2016 లో విడుదల అవుతుంది. ఈ సంవత్సరం కూడా లీఫ్ ఇయిరే మరి.

English summary
As fans are calculating predictions and sentiments for success for pawan klayan Sardar gabbar singh, they are fixed that the movie would be a Block buster as pawan kalyan earlier block busters Badri, Jalsa, gabbar singh were released on leap years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu