నేను అర్హుడినా అని కళ్ళు చెమర్చాయి: పవన్ కళ్యాన్ ఫ్యాన్స్‌కి ప్రేమతో శివబాలాజీ
శివబాలాజీని పవన్ తన తమ్ముడిలా భావిస్తాడు. దీంతో పవన్ తమ్ముడిగా శివకు కూడా ఆయన అభిమానులు మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతూ..
Recommended Video

శివ బాలాజీ నిర్మించి.. నటిస్తున్న సినిమా స్నేహమేరా జీవితం. ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. సెకండ్ హీరోగా చేసిన చేసిన ఆర్య, స్ట్రైట్ హీరోగా చేసిన "ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ" సినిమాల కంటే ఎక్కువ గుర్తింపు మొన్న వచ్చిన బిగ్ బాస్ షో తో వచ్చింది.

మల్టీ స్టారర్‌తో
బిగ్ బాస్ సీజన్ 1తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన శివాబాలాజీ నిర్మాతగా మారి వెండితెర ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. కాటమరాయుడులో పవన్ కల్యాణ్ సోదరుడిగా నటించిన శివబాలాజీ ఓ మల్టీ స్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

స్నేహమేరా జీవితం
నిజానికి చాలాకాలంగా ఓ దశలో అతడికి అవకాశాలే లేకుండా పోయాయి. ఐతే ఆ సమయంలోనే సొంతంగా నిర్మాతగా మారి "స్నేహమేరా జీవితం" అనే సినిమా మొదలుపెట్టాడు శివబాలాజీ. ఈ సినిమా కొన్ని నెలల కిందటే పూర్తయింది కూడా. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఒక యధార్థ ఘటనని ఆధారంగా చేసుకుని ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ సినిమా.

నటుడు రాజీవ్ కనకాల
ఈ సినిమాలో శివబాలాజీతో పాటు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కీలకపాత్రలో నటిస్తున్నాడు. శివబాలాజీ సరసన యు.ఎస్‌కు చెందిన తెలుగు అమ్మాయి, క్లాసికల్ డ్యాన్సర్ సుష్మ యార్లగడ్డ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.ఇప్పుడు అతడికి ఫాలోయింగ్ పెరిగింది.

1982 నాటి నేపథ్యంలో
ఇప్పుడు సరైన టైమింగ్ చూసి "స్నేహమేరా జీవితం" ట్రైలర్ లాంచ్ చేశాడు శివబాలాజీ. ఈ మధ్య రిలీజైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగానే చర్చనీయాంశమవుతోంది. 1982 నాటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. శివబాలాజీతో పాటు రాజీవ్ కనకాల హీరోలుగా నటించారిందులో.

సినిమా పోస్టర్‌కి హారతులిచ్చారు
శివబాలాజీని పవన్ తన తమ్ముడిలా భావిస్తాడు. దీంతో పవన్ తమ్ముడిగా శివకు కూడా ఆయన అభిమానులు మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతూ.. సినిమా పోస్టర్‌కి హారతులిచ్చారు. ఈ వీడియోను చూసిన శివబాలాజీ ఆనందంతో పొంగిపోయారు.

సోషల్ మీడియాలో
ఈ వీడియోను జత చేస్తూ తన కామెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఇంత ప్రేమకు నేను అర్హుడినా అని కళ్లు చెమర్చాయి, మనసు కలవరంగా ఉంది. నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం మీ ఈ ప్రేమ.. ఏం చేసి, ఏం ఇచ్చి ఇంత ప్రేమను తిరిగివ్వగలనో అర్థం కావట్లేదు. మీకు సదా రుణపడి ఉంటాను. ఇంతగా అభిమానిస్తున్న మీలో ప్రతి ఒక్కరికీ వేల కోట్ల వందనాలు.. కృతజ్ఞతలు" అంటూ శివబాలాజీ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











