పెళ్లి చేసుకొంటే చంపేస్తాం.. బెదిరింపులు: రేణుదేశాయ్‌.. స్పందించిన మహేష్ కత్తి, నందినీరెడ్డి

By Rajababu

పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికి సుమారు ఆరేళ్లు అవుతున్నది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న రేణుదేశాయ్‌కి మళ్లీ తోడు దొరికింది. తన మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకొనేందుకు రేణుదేశాయ్ సిద్ధమయ్యారు. జూన్ 24 ఆదివారం రాత్రి రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. పుణేలో ప్రైవేట్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న రేణుదేశాయ్ తన పెళ్లిపై జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్యూలో తన స్పందనను వ్యక్తం చేశారు.

Recommended Video

Renu Desai Engagement Pics Goes Viral
పెళ్లి కొడుకు ఎవరంటే..

పెళ్లి కొడుకు ఎవరంటే..

కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందుకు చాలా ఆనందంగాను, ఎక్సైటింగ్‌గానూ ఉంది. నా జీవితంలో చోటుచేసుకొన్న ప్రతికూల పరిస్థితులకు శాశ్వతంగా ముగింపు పలికి ొత్త జీవితాన్ని ఫ్రెష్‌గా ఆరంభించనున్నాను అని రేణుదేశాయ్ వెల్లడించారు. తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి గురించి ఎక్కువగా వివరాలు వెల్లడించడానికి రేణుదేశాయ్ నిరాకరించారు.

సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు

సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు

నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాదు. ఆయన ప్రైవేట్ రంగానికి చెందిన వారు. అతడి గురించి ఎక్కువగా చెప్పడానికి నేను ఇష్టపడటం లేదు. కాకపోతే మా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది అని మాత్రం చెప్పగలను. కొత్త జీవితాన్ని ఆరంభించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను అని రేణుదేశాయ్ పేర్కొన్నారు.

 రేణుదేశాయ్‌కి బెదిరింపులు

రేణుదేశాయ్‌కి బెదిరింపులు

రేణుదేశాయ్ తన నిశ్చితార్థం వార్తను వెల్లడించడానికి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రస్థాయిలో స్పందించారు. కొందరు సలహాలు సూచనలు ఇవ్వగా, మరికొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె ఇన్స్‌టాగ్రామ్ పేజి సెట్టింగ్స్‌ను మార్చుకోవాల్సి వచ్చింది.

తీవ్ర పరిణామాలు ఎదుర్కో..

తీవ్ర పరిణామాలు ఎదుర్కో..

రెండో పెళ్లి చేసుకొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని రేణుదేశాయ్‌ని కొందరు అభిమానులు హెచ్చరించారు. మేడమ్ రెండో వివాహం చేసుకోవద్దు. మీరు పెళ్లి చేసుకొంటే మా దేవుడు హర్ట్ అవుతాడు. సింగిల్ ఉండి చాలా మహిళలు లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. మీరు రెండో వివాహం చేసుకొని చెడ్డవారిగా మారకండి అని అన్నారు.

రెండో పెళ్లి వద్దు

రెండో పెళ్లి వద్దు

ప్లీజ్.. ప్లీజ్. మీరు రెండో పెళ్లి చేసుకోకండి. అలా చేస్తే మీకు బయటవారికి తేడా ఏముంటుంది అని మరి కొందరు సలహా ఇచ్చారు. ఒకవేళ మీరు రెండో పెళ్లి చేసుకొంటే చాలా గొడవలు అవడం పక్కా. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ వల్ల మా దేవుడికి సమస్య రావొద్దు. మీ జీవితం మీకు ఇష్టం. మీ వల్ల మా దేవుడికి ఎలాంటి సమస్య రావొద్దు అని పవన్ వీరాభిమాని ప్రార్థించారు.

పిచ్చి మోతాదు మించింది

పిచ్చి మోతాదు మించింది

అభిమానులు, పవన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న తీవ్రమైన కామెంట్లపై రేణుదేశాయ్ స్పందించారు. మోతాదు మించిన పిచ్చికి ఇదో స్పెషల్ కేటగిరిలా కనిపిస్తున్నది. తమ తల్లి, అక్కాచెల్లెళ్లతో వాళ్లు ఎలా ఉంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకొంటే నన్ను చంపుతామని బెదిరించారు. దీంతో వారి మానసిక పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నాను అని రేణుదేశాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

భౌతికంగా దాడి చేస్తే..

భౌతికంగా దాడి చేస్తే..

సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని రేణుదేశాయ్ చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ట్వీట్‌ను తొలగించారు. ఇలాంటి పరిస్థితులను చూస్తే నాకు భయంగా ఉంది. సోషల్ మీడియాలో కాబట్టి సరిపోయింది. ఎవరైనా భౌతికంగా దాడి చేస్తే పరిస్థితి ఏమిటి అని రేణుదేశాయ్ అన్నారు.

మహేష్ కత్తి కామెంట్

మహేష్ కత్తి కామెంట్

పవన్‌పై పిచ్చి అభిమానంతో బెదిరించడం, ట్రోల్ చేయడం సరికాదు అని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినీ నటుడు కాదు. ఆయన ఓ రాజకీయ నాయకుడు. అభిమానులు ఇలా ప్రవర్తిస్తే ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంతకు ముందు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. రేణు దేశాయ్‌కి వస్తున్న బెదిరింపులకు ఆయనే బాధ్యుడు అవుతాడు అని కత్తి అన్నారు.

డైరెక్టర్ నందినీరెడ్డి స్పందన

డైరెక్టర్ నందినీరెడ్డి స్పందన

రెండో పెళ్లి చేసుకొంటున్న రేణుదేశాయ్‌పై అభిమానులు చేస్తున్న సోషల్ దాడిపై దర్శకురాలు నందిని రెడ్డి స్పందించారు. రేణుదేశాయ్, పవన్ కల్యాణ్ అధికారికంగా విడాకులు పొందారు. ఇప్పుడు రేణు ఎవరినైనా పెళ్లి చేసుకొనే స్వేచ్ఛ ఆమెకు ఉంది. పవన్ చాలా సెన్సిబుల్. స్వేచ్ఛకు విలువ ఇచ్చే వ్యక్తి. పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా అభిమానులు తప్పుడు చేష్టలకు పాల్పడవద్దని నందిని రెడ్డి సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X