RIP Jana Sena సిగరెట్, అమ్మాయితో ఆర్జీవీ జల్సా.. జగన్‌‌ను కూడా తీసుకెళ్లకపోయావా? నెటిజన్ల ట్రోలింగ్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో పెడుతున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించి చేస్తున్న ట్వీట్లు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. అయితే తనదైన శైలిలో ఫుల్లుగా మందు కొట్టి.. అమ్మాయిలతో జల్సా చేస్తూ పెట్టిన పోస్టుపై నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన ట్వీట్ల వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ స్పీచ్ తర్వాత: ఏపీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయంలో నేతలతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 135 సీట్లతో ఒంటరిగా పోటీచేశాం. కనీసం 30, 40 సీట్లు మనం గెలిచి ఉంటే.. ముఖ్యమంత్రి పదవి పోస్టుకు పోటీ పడే వాళ్లం. మనం సీట్లు గెలువలేనప్పుడు సీఎం సీటు ఆశించడం తప్పు. మనం ఒకరిని సీఎం పదవి అడిగి తెచ్చుకోవడం కాదు. సత్తా చాటి సీఎం పదవి చేపడుదాం అని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan Fans trolls Ram Gopal Varma over RIP Jana Sena

పవన్ కల్యాణ్‌పై వర్మ ట్వీట్లు: దాంతో సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌పై వైసీపీ అనుకూల వర్గాలు ట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ చేతులెత్తాశాడు అంటూ చేస్తున్న ట్రోల్స్, వీడియోలోను తన అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఆనందాన్ని వర్మ పంచుకొన్నాడు. రకరకాల కామెంట్లను, వీడియోలతో పవన్ కల్యాణ్ అభిమానులను పరోక్షంగా ట్రోల్ చేస్తున్నాడు.

Pawan Kalyan Fans trolls Ram Gopal Varma over RIP Jana Sena

వెన్నుపోటు పొడిచాడంటూ: పవన్ కల్యాణ్‌పై రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. ఆ రోజు @ncbn #NTR ను వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు @PawanKalyan తన జనసైనికులని, తన ఫ్యాన్స్ ను వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి అని తనదైన శైలిలో మెగా అభిమానులను ఉద్దేశించి ట్రోల్ చేశాడు.

Pawan Kalyan Fans trolls Ram Gopal Varma over RIP Jana Sena

కాపులకు వెన్నుపోటు అంటూ: రాంగోపాల్ వర్మ అంతటితో ఆగలేదు. పవన్ కల్యాణ్‌పై వరుసగా ఏదో ఒక ట్వీట్ చేస్తున్నాడు. తాజాగా తాను చేసిన ట్వీట్‌కు పొడిగిపుగా మరో ట్వీట్ చేశాడు.తన సొంత ఫ్యాన్స్‌నే కాకుండా తన కాపుల్ని చివరికి తానే వెన్నుపోటు పొడిచేసుకొన్నాడు అని వర్మ ట్వీట్లు చేశాడు.

Pawan Kalyan Fans trolls Ram Gopal Varma over RIP Jana Sena

పబ్‌లో జల్సా చేస్తూ:ఇక అంతటితో ఆగకుండా రాంగోపాల్ వర్మ.. పబ్‌లో అమ్మాయితో జల్సా చేస్తూ ఫోటోతో ట్వీట్ చేశాడు. ఓ అమ్మాయితో సిగరెట్ట తాగుతూ.. తాగిన మత్తులాంటి ముఖంతో తాను సిగరెట్ తాగుతూ పోటో దిగి ట్వీట్ చేశాడు. ఆ ఫోటోతోపాటు RIP Jana Sena అంటూ ట్వీట్ చేశాడు. బాధలో మేమిద్దరి అంటూ మరో పోస్టు చేశాడు.

Pawan Kalyan Fans trolls Ram Gopal Varma over RIP Jana Sena

స్త్రీల మీద వ్యసనం అంటూ: రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు, వైసీపీ, ఆర్జీవి అభిమానులు రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు. 'ఇది బాధ కాదు.. స్త్రీల మీద వ్యసనం. పవన్ పట్ల పైశాచికత్వం', ఎన్ని సార్లు కొట్టినా సావని పాము రా నువ్వు.. 'టైమ్ దగ్గర పడింది నీకు', వైఎస్ జగన్‌ ఎన్ని కూడా పట్టుకెళ్లాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X