»   » చిరంజీవిని ఇబ్బంది పెట్టిన పవన్ కళ్యాన్..!!

చిరంజీవిని ఇబ్బంది పెట్టిన పవన్ కళ్యాన్..!!

Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు ఏదైనా ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే అలవాటు. ఇంతకు ముందు ఎన్నో సార్లు ఈ విషయం రుజువయింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్యూలో మరో సారి ఈ విషయం వెళ్లడయింది. ఆ విశేషాల్లోకి వెలితే... ఇటీవలే ఓ వార్తా పత్రిక మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి, పవన్ కళ్యాన్, నాగబాబులను ఇంటర్యూ చేసింది. ఇందులో భాగంగా మీ అభిమాన హీరో ఎవరని పవన్ కళ్యాన్ ను అడిగాడు ఆ విలేకరి. పవన్ ఖచ్చితంగా తన అన్నయ్య చిరంజీవి పేరునే చెబుతాడని అందరూ భావించారు. కానీ పవన్ వీటన్నిటికీ చెక్ పెడుతూ అమితాబ్ బచ్చన్ అని చెప్పాడు. చిన్నప్పటినుండీ అమితాబ్ అంటే చాలా ఇష్టమనీ ఆయన చెప్పుకొచ్చారు.

ఈ మాటవిన్న వారు మాత్రం ఆంద్రరాష్టంలో ఎంతో మంది అభిమానులున్న చిరు, పవన్ కు నచ్చలేదా..!? అని ఆశ్చర్యపోయారంట. తన అభిమాన హీరోగా పవన్ తన పేరే చెబుతాడని అనుకున్న చిరంజీవి కూడా ఈ సమాధానంతో కొద్దిగా ఇబ్బంది పడ్డారట. కానీ తన నటనా చాతుర్యంతో అది బయటకు కనబడకుండా జాగ్రత్త పడ్డాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu