పవన్ కళ్యాణ్ ఎందుకంత సంతోషంగా ఉన్నాడు!?
పవన్ కళ్యాణ్ ఏంటీ పిచ్చ హ్యాపి ఏంటీ అనుకుంటున్నారు కదా! అవును మీరు విన్నది నిజమే రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలపై ఫుల్ గా మనసు పెట్టిన పవన్ తాజా చిత్రం 'కొమరం పులి" తో పాటు ఈ మధ్యే ప్రారంభమైన మరో చిత్ర విషయాలతో ఎంతో సంతోషంగా ఉన్నాడట. ఎప్పుడూ ముభావంగా కనిపిస్తూ..ముక్తసరిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ మద్య అందరికీ ముసి ముసి నవ్వులతో కనిపిస్తున్నాడు. విషయమేంటా అని ఆరా తీస్తే రెండు రీజన్స్ తెలిశాయి. 'కొమరం పులి" షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి..తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న పవన్ చిత్రం అద్బుతంగా రావడంతో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండటంతో చిత్రం గ్యారంటీగా హిట్ అవుతుందని చెబుతున్నాడు.
మరి ఎప్పుడు హిట్ గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్ చిత్రం బాగా వచ్చింది. గ్యారంటీ హిట్ అంటే పులి పంజా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఇట్టే అర్థమవుతుంది..అలాగే మరో చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ 'లవ్ ఆజ్ కల్" రీమేక్ చిత్రం కూడా పవన్ సంతోషానికి కారణం. ఆ చిత్రానికి దర్శకుడు జయంత్ సి. పరాన్జీ అయినప్పటికి మాటల రచయిత మాత్రం పవన్ 'జల్సా" చిత్ర దర్శకుడు పవన్ కి త్రివిక్రమ్ వినిపించాడట. ఆ డైలాగ్స్ విన్న పవన్ కళ్యాణ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడట..మరి ఇదంతా చూస్తుంటే గతంలో జయంత్ దర్శకత్వంలో వచ్చిన చిరు చిత్రం 'బావగారు బాగున్నారా" వంటి చిత్రం అవుతుందని డైలాగ్స్ త్రివిక్రమ్ పద్దతిలో అదిరిపోయేలా ఉన్నాయనీ అందుకే పవన్ కూడా నవ్వేశాడని ఆ చిత్రం కూడా తమ అభిమాన హీరో లిస్ట్ లో మంచి హిట్ అవుతుందని ఇప్పటికే పవన్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారట.


Click it and Unblock the Notifications











