దసరాకి రానున్న పవన్ కళ్యాణ్ స్టైలిష్ ఫస్ట్ లుక్..!?
నీలిమా తిరుమల శెట్టి మరియు శోభు యార్లగడ్డ నిర్మాణ సారధ్యంలో సంగమిత్ర ఆర్ట్స్ మరియు ఆర్కా మీడియా బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విష్ణువర్థన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా కోల్ కత్తా, కేరళ ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ పూర్తి చేసిన విషయం విధితమే. ఇంకా టైటిల్ ఖరారు కాని (ది షాడో, కాళీ, పవర్ వర్కింగ్ టైటిల్స్) ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదా సంక్రాతికి విడుదలచేయడానికి షూటింగ్ శరవేగంగా రూపుదిద్దుకొంటోంది.
పవన్ కళ్యాణ్ ని డిఫరెంట్ గా చూపించేందుకు దర్శకుడు విష్ణువర్థన్ ట్రై చేస్తున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ దసరాకి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. సారా జేన్, అంజలి లావణ్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇదో స్టైలిష్ మూవీ అవుతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్.


Click it and Unblock the Notifications











