పొల్లాచిలో పవన్ కళ్యాణ్ కారు ఛేజ్
హీరో,హీరోయిన్స్,విలన్స్, పాల్గొంటున్నారు. ఎనిమిది రోజులపాటు కారు ఛేజ్ దృశ్యాల చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ఈ కాంబినేషన్ గురించి చెప్పగానే 'జల్సా' చిత్రమే గుర్తుకొస్తుంది. అందులో పవన్ పోషించిన సంజయ్ సాహు పాత్ర ద్వారా కావల్సినంత వినోదాన్నీ, యాక్షన్ అంశాల్నీ అందించారు దర్శకుడు. ఇప్పుడు ఈ సీన్స్ కూడా సినిమాలో కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు.
ప్రస్తుతానికి ఈ చిత్రానికి 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా దీన్ని అధికారికంగా ఖరారు చేయలేదు. పూర్తిగా కమర్షియల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రం పవన్ కళ్యాన్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగులు, స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్ కానుంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేయటానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్న పవన్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రచ్చ దర్సకడుతో ఆయన చేయబోయే చిత్రం మే నుంచి ప్రారంభం కానుంది. రీసెంట్ గా స్క్రిప్టుని ఫైనల్ చేసి లాక్ చేసిన పవన్... ప్రీ ప్రొడక్షన్ చేసుకోమని అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ మిత్రుడు శరద్ మరార్ నిర్మించనున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. NTV ఛానెల్ సి.ఈ.ఓ గా చేస్తున్న శరత్ మరార్ నిర్మతగా కొత్త చిత్రం తెరకెక్కనుందని సమాచారం.


Click it and Unblock the Notifications












