పవన్ కళ్యాణ్ లేటెస్ట్ 'లవ్ లీ' చిత్రం రిలీజ్ ఎప్పుడంటే...
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "పవన్ కళ్యాణ్ లవ్ లీ" 2011 ఏప్రియల్ మొదటి వారంలో విడుదలకు ప్లాన్ చేస్తునట్లు సమాచారం. ఈ చిత్రాన్ని జయంత్ సి.పర్జానీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మిస్తున్నారు. 'లవ్ ఆజ్ కల్' రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది.వచ్చే వారం నుంచి ఈ చిత్రం షూటింగ్...సౌత్ ఆఫ్రికాలో కంటిన్యూ షెడ్యూల్ జరగనుంది. పవన్ కళ్యాణ్ గత హిట్ చిత్రం బద్రి షూటింగ్ అక్కడే జరిగింది. పిబ్రవరి తో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలెడతారు. లవ్, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్... ఇలా అన్ని కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో ఉంటాయి. త్రిష, కృతి కర్బందా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఇటీవల కాశీలో షూటింగ్ జరుపుకుని వచ్చింది. రైటర్ అండ్ దర్శకుడు అయిన త్రివిక్రమ్ ఈ చిత్రానికి పూర్తి స్క్రిప్ట్‌ని అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: బడే రవికిరణ్, ఛాయాగ్రహణం: జైనన్ విన్సెంట్, సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











