అఫీషియల్: పవన్ కళ్యాణ్‌తో దాసరి సినిమా
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రస్తుత టాలీవుడ్ నెం.1 హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. ఈ విషయం అపీషియల్ గా ఖరారైంది. తారకప్రభు ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రానుంది. ఈ విషయాన్ని దాసరి నారాయణరావు స్వయంగా ప్రకటించారు.

తెలుగు తెరపై ఇదో రేర్ కాంబినేషన్. దాసరి నారాయణరావు సొంత బేనర్ అయిన తారకప్రభు బ్యానర్లో నిర్మాణం అవుతున్న 37వ సినిమా ఇది. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటున్నాయి. అలాంటి నిర్ణయాల్లో దాసరి దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతుండటం కూడా ఒకటి.
త్వరలో ఈ సినిమా వివరాలు, లాచింగ్ డేట్, షూటింగ్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రం సందేశాత్మకంగా ఉంటుందని భావిస్తున్నారు. మరో వైపు ఈ వార్త విని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పూర్తి వివరాల కోసం చూస్తేనే ఉండటండి ఫిల్మీబీట్.కామ్


Click it and Unblock the Notifications











