twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నయ్యను గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం, ఫ్యాన్స్ అతి చేయొద్దని వార్నింగ్!

    By Bojja Kumar
    |

    అఖిల భారత చిరంజీవి యువత సభ్యులుగా ఉన్న మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా ఇటీవల జనసేనకు తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా వారితో సమావేశమైన పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గురించి భావోద్వేగంతో మాట్లాడారు. తాను ప్రసంగిస్తుండగా అరుస్తూ గోల చేస్తూ అతి ఉత్సాహం ప్రదర్శించిన వారిపై పవర్ స్టార్ ఫైర్ అయ్యారు. అరుపులు, కేకలు పద్దతి కాదు, ఉత్సాహం ఉండొచ్చు... అతి ఉత్సాహం ఇన్‌డిసిప్లేన్‌కు దారి తీస్తుంది. మీ అందరి అభిమానం సంతోషకరమైంది అయినప్పటికీ దానికి ఒక క్రమ పద్దతి లేకపోతే కష్టం అవుతుంది అంటూ మందలించారు.

    Recommended Video

    జనసేన చిరంజీవి అభిమానులది: పవన్ కళ్యాణ్
    నేనెప్పుడూ హీరో అనుకోలేదు

    నేనెప్పుడూ హీరో అనుకోలేదు

    జనసేన పార్టీ ఎవరిదో కాదు... చిరంజీవి గారి అభిమానుల్లో ఒకరు పెట్టింది. నేను కూడా మీలో ఒకడినే. నేను ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టలేదో చాలా మందికి తెలియదు.... అందుకు కారణం చిరంజీవి గారే, నాకు ఆయనే హీరో, నేను హీరో అని ఎప్పుడూ ఫీలవ్వలేదు... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

    ఆయన్ను తప్ప ఎవరినీ అభిమానించలేక పోయాను

    ఆయన్ను తప్ప ఎవరినీ అభిమానించలేక పోయాను

    నా జీవితంలో ఉన్నది ఒకే ఒక్క హీరో... చిన్నపుడు అన్నయ్యగారు సినిమాల్లోకి రాక ముందు నాకు నచ్చిన హీరో అమితాబ్ బచ్చన్, అన్నయ్యగారు యాక్టర్ అయిన తర్వాత ఎవరినీ అభిమానించలేక పోయాను. అన్నయ్య అంటే నాకు అంత ఇష్టం

     వెళ్లి తిట్టడం, కొట్టడం చేసేవాన్ని, అందుకే చెడ్డపేరు

    వెళ్లి తిట్టడం, కొట్టడం చేసేవాన్ని, అందుకే చెడ్డపేరు

    అన్నయ్యగారంటే ఎంత అభిమానం అంటే... చిరంజీవి గారి మీద మాట పడనిచ్చేవాడిని కాదు. ఆయన్ను ఏమైనా అంటే కొడతాడు, తిడతాడు అనే చెడ్డపేరుంది. అప్పట్లో నా ప్రవర్తన అలా ఉండేది. అదే మీరు నన్ను తిట్టండి, ఏదైనా అనండి నాకు కోపం రాదు. కానీ అన్నయ్యను అంటే కోపం వస్తుంది.

    అందుకే ఆయన నాకు హీరో...

    అందుకే ఆయన నాకు హీరో...

    నాకు ఇష్టమైన హీరో చిరంజీవిగారు. అందుకు కారణం ఆయన హిట్ సినిమాలు తీశారని కాదు. చాలా మామూలు, సామాన్య కుటుంబీకుడు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో, చిన్నపాటి గ్రామంలో, ఒక చిన్నపాటి టౌన్లో.... మా నాన్నగారు ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే అలాంటి వ్యక్తి కొడుకు. చాలా గొప్ప కలగన్నారు. డిగ్రీ చదువుకున్నాడు, ఆయన నాకు సినిమాల్లోకి రాక ముందు నుండి హీరో. ఆయన ఎన్‌సీసీలో నావెల్ కెప్టెన్. ఇందిరా గాంధీ ముందు రిపబ్లిక్ డే పెరేడ్‌కు ఆయన సెల్యూట్ చేస్తూ వెళ్లడం చిన్నపుడు ఫోటోల్లో చూసేవాడిని. సినిమాల్లోకి రాక ముందు నుండే నాకు ఆయన హీరో అయ్యాడు.

    ఇద్దరినీ ఒకే చోట చూసే భాగ్యం దక్కింది

    ఇద్దరినీ ఒకే చోట చూసే భాగ్యం దక్కింది

    ఊహ తెలిసినప్పటి నుండి చిరంజీవి, అమితాబ్ బచ్చన్ గారిని చూస్తున్నాను. వారిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. సైరా నరసింహారెడ్డి షూటింగ్ కోసం అమితాబ్ గారు వస్తున్నారని అన్నయ్య చెప్పడంతో వెళ్లాను. వారి పాదాలకు నమస్కారం చేశాను. నాకు ఇష్టమైన ఇద్దరు హీరోలను ఒకే చోట చూసుకునే అవకాశం లభించింది... అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

    మీ వల్లే బ్రతికి ఉన్నాను

    మీ వల్లే బ్రతికి ఉన్నాను

    పది సంవత్సరాలు ఒక్క సక్సెస్ లేకున్నా కేవలం మీ ప్రేమాభిమానాల వల్లే బ్రతికి ఉన్నాను. నేను జీవితంలో ఏమీ ఆశించలేదు కూడా. చాలా సంవత్సరాల క్రితం, విజేత సినిమా సమయంలో చిరంజీవిగారు నన్ను అడిగారు. నీకు ఏమవుదామని ఉందంటే... ఏమో తెలియదు, వీలైతే నీకు సెక్యూరిటీ గార్డుగా నీ పక్కన ఉండాలనుకుంటున్నాను, నిన్ను బాగా చూసుకుంటాను అన్నాను. అంతకు మించి నాకు ఆశలు కూడా లేవు, సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

    అన్నయ్య మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు

    అన్నయ్య మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు

    చిన్నతనంలో చిరంజీవిగారి మీద ఎంత ప్రేమ ఉండేదో.... ఈ రోజుకీ అదే ప్రేమ, అదే గౌరవం ఉంది. అవి పెరిగేవే తప్ప తగ్గేవి కావు. చూసే వారికి వేరే పార్టీ పెట్టాడు అని కనిపిస్తూ ఉంటుంది. ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చాక ప్రజా సమస్యలు పట్టించుకునే వాడు లేరు కాబట్టి జనసేన పార్టీ పెట్టడం జరిగింది.. అని పవన్ కళ్యాణ్ అన్నారు.

    English summary
    Pawan Kalyan Superb speech at at Akhila Bharatha Chiranjeevi Yuvatha Meeting. Jana Sena President Pawan Kalyan while addressing Chiranjeevi fans he thanked them for coming in large numbers. He warned the fans not to create noise. Pawan asked fans to sit at their places.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X