బాహుబలి, ఆదిపురుష్‌తో ప్రభాస్‌కు డబ్బు.. వైఎస్ జగన్‌ అక్రమాలతో అన్ని ఆస్తులు.. పవన్ కల్యాణ్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వరాహి విజయ యాత్ర నరసాపురంలో జరిగింది. పవన్ కల్యాణ్ సభకు భారీగా జనం తరలివచ్చారు.ఈ సభలో ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్‌కు అండగా నిలిచారు. పవన్ కల్యాణ్ పోస్టర్లతోపాటు ప్రభాస్ పోస్టర్లు కలిపి హంగామా చేశారు. పలు చోట్ల ప్రభాస్, పవన్ కల్యాణ్ ఉన్న కటౌట్లను పెట్టారు. నరసాపురం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

ఇప్పుడే ప్రభాస్ కటౌట్ చూపించారు. ప్రభాస్ సినిమాల గురించి మాట్లాడుకొంటే.. ఆయన ఒక బాహబలి చేసినా.. ఒక ఆదిపురుష్ చేశాడు. ఆ సినిమాల రిలీజ్ ఎలాగైనా ఉండవచ్చు. కానీ ఆయన సినిమా వచ్చిందంటే.. రోజుకు 500 నుంచి 1000 మంది వరకు.. ఒక్కోసారి 2000 మందికి ఉపాధి కల్పిస్తారు అని పవన్ కల్యాణ్ అన్నాడు.

Pawan Kalyan

ప్రభాస్ సినిమాలు చేసి ఇన్‌కమ్ టాక్స్ కడుతారు.. జీఎస్టీ కడుతారు. రోజు షూటింగులో వందల మందికి అన్నం పెడుతారు. ఆయన సినిమా రిలీజ్ అయితే థియేటర్ వద్ద ఎంతో మంది చిరు వ్యాపారులు బిజినెస్ జరుగుతుంది. తోపుడు బండ్లు నడుపుకొనే వారికి ఆదాయం వస్తుంది. ఎంతో మందికి జీవితం, వ్యవస్థ నడుస్తుంది అని పవన్ కల్యాణ్ చెప్పారు.

Pawan Kalyan

అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ప్రభాస్ మాదిరిగా సినిమాలు చేశాడా? ఇలాన్ మస్క్ మాదిరిగా బిజినెస్ చేయలేదు. తండ్రి ముఖ్యమంత్రి కొడుకు పైరవీలు చేసి అక్రమంగా డబ్బులు సంపాదించాడు. రోడ్డుపై దౌర్జన్యాలు చేస్తున్నాడు అని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

Pawan Kalyan

తండ్రి ముఖ్యమంత్రి అయితే పులివెందులలో దౌర్జన్యాలు చేశాడు. ఇన్స్‌పెక్టర్‌ను పోలీస్ స్టేషన్‌లో కొట్టి లాకప్‌లో పడేశాడు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పోలీసులు పనిచేస్తారా? పోలీసులు సలాం కొడితే ప్రజల పరిస్థితి ఏంటి. అలాంటి వ్యక్తికి అధికారం ఇస్తారా? అని పవన్ కల్యాణ్ నిలదీశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X