»   » నా తొలి లవ్ ఎఫైర్ అదే.... మా ఇంట్లో కూడా నన్ను అర్థం చేసుకోలేదు: పవన్ కళ్యాణ్

నా తొలి లవ్ ఎఫైర్ అదే.... మా ఇంట్లో కూడా నన్ను అర్థం చేసుకోలేదు: పవన్ కళ్యాణ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Pawan Kalyan Talks About His First Crush

  పవన్ కళ్యాణ్‌కు తుపాకీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లో తప్పకుండా తుపాకితో సీన్లు ఉంటాయి. కుదరకపోతే పాటల్లో అయినా తుపాకీ పట్టుకుని విన్యాసాలు చేస్తుంటారు. ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన జనసేన పార్టీ అధినేతగా ఏపీలో పోరాట యాత్ర నిర్వహిస్తున్నారు. విశాఖ పర్యటనలో ప్రసంగంలో తుపాకి ప్రస్తావని తెస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

   ఆరోజు అన్నయ్యకు చెప్పలేక పోయా

  ఆరోజు అన్నయ్యకు చెప్పలేక పోయా

  మా అన్నయ్య నాకు రివాల్వర్ కొనిచ్చారు. అది దేనికి కొనిచ్చారంటే... వీడికి ఉన్న కోపంతో తీవ్రవాద ఉద్యమాల్లోకి వెళ్లిపోతాడేమో అని... ఒక తుపాకి కొనిస్తే ఈ వ్యక్తి ఆగిపోతాడని అనుకున్నారు. కానీ మా అన్నయ్యగారికి ఆరోజు చెప్పలేక పోయాను. నా ఆవేదన, ఆవేశం అన్యాయం మీదే కానీ... తుపాకీ సొంతం చేసుకోవాలనే కోరిక మీద కాదు. ఆ రోజు ఈ విషయాన్ని వివరించలేక పోయాను.... అని పవన్ క ళ్యాణ్ తెలిపారు.

  నా తొలి లవ్ ఎఫైర్ అదే...

  నా తొలి లవ్ ఎఫైర్ అదే...

  అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్ తీసుకున్నాక దానిపై విపరీతమైన ప్రేమ ఏర్పడింది. తల్లిదండ్రులను ప్రేమించాను కానీ... నా జీవితంలో లవ్ ఎఫైర్ అనేది రివాల్వర్ తోనే మొదలైంది. రోజూ నా జేబులోనే పెట్టుకునేవాడిని. రాత్రి పక్కలో పెట్టుకుని పడుకునే వాడిని, నిద్ర లేవగానే ముద్దు పెట్టుకునేవాడిని. అదంటే అంత ఇష్టం ఏర్పడింది అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

  అందుకే సీపీఎఫ్ పెట్టాను

  అందుకే సీపీఎఫ్ పెట్టాను

  ఆ రోజున అన్నయ్యగారి కుటుంబం మీద దాడి జరిగితే ఆవేదన కలిగింది. చిరంజీవి స్థాయి వ్యక్తిని కూడా మీరు ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనిపించింది. అప్పుడున్న ప్రతిపక్షం, అధికార పక్షం... వారి దౌర్జన్యం మీద, దోపిడీ మీద కోపం వచ్చింది. ఒక సామాజిక మార్పుకోసం, ఒక సామాజిక న్యాయం కోసం ఉవ్వెత్తున ఒక తరంగం వస్తుంటే దానిని నిలువరించడానికి, నీరు కార్చడానికి వారు చేసిన ప్రయత్నానికి కోపం వచ్చింది. అందుకే సీపీఎఫ్ (కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్) పెట్టాను అని పవన్ తెలిపారు.

  తెలివి తక్కువగా, అనాలోచితంగా కాదు

  తెలివి తక్కువగా, అనాలోచితంగా కాదు

  సీపీఎఫ్ (కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్) పెట్టింది.. తెలివి తక్కువగా, అనాలోచితంగా కాదు. చాలా చాలా ఆలోచించి పెట్టాను. అన్యాయాలను ఎదుర్కోవడానికి, అధర్మాలను నిలువరించడానికి పెట్టాను. ఆ రోజు అందరికీ అది అర్థం కాక పోయి ఉండొచ్చు. పెద్ద స్థాయి వ్యక్తులకు కూడా నేను అర్థం కాలేదు, చాలా తక్కువ మంది మేధావులకు నేను అర్థం అయ్యాను... అని పవన్ తెలిపారు.

   మా ఇంట్లో వారు కూడా అర్థం చేసుకోలేదు, వారికి మాత్రమే అర్థమయ్యాను..

  మా ఇంట్లో వారు కూడా అర్థం చేసుకోలేదు, వారికి మాత్రమే అర్థమయ్యాను..

  నేను సీపీఎఫ్ పెట్టినపుడు.... ప్రజా క్షేమం కోరే ఒక భువనగిరి చంద్రశేఖర్ లాంటి మేధావులకు అర్థం అయ్యాను, అన్నా నీ కోసం మా ప్రాణాలను ఇచ్చేస్తామని చెప్పిన మన జనసైనికులకు అర్థం అయ్యాను. ఆ రోజున నా సొంత ఇంట్లో వారు కూడా నన్ను అర్థం చేసుకోలేదు.... అని పవన్ గుర్తు చేసుకున్నారు.

  English summary
  Pawan Kalyan said that, his first love affair with Revolver which was Gifted by his Brother Chiranjeevi. Sharing about Chiranjeevi gifting him a revolver, he could not explain Chiranjeevi that his anger and worry is not for revolver but for the injustice in society. As got anguished by the prevailing conditions in society, he formed Common man Protection Force to deal with injustice and to stop unrighteous things, PK revealed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more