»   »  పవన్ కళ్యాణ్ సీక్రెట్...సాత్విక్ డైట్!

పవన్ కళ్యాణ్ సీక్రెట్...సాత్విక్ డైట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నఫ్యాన్ ఫాలోయిగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయ గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆయన సినిమాలతో పాటు, ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటారు.

పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు నిర్మాత కూడా పవన్ కళ్యాణే కావడంతో ఎన్నడూ లేని విధంగా స్వయంగా తానే సినిమాకు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Pawan Kalyan fitness Secret

ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పి అందరిని ఆశ్యర్యపరిచాడు. చిన్నప్పటి నుండి కరాటే శిక్షణ తీసుకుంటూ ఉన్న నేను , ఇప్పటికి వీలు చిక్కినప్పుడల్లా కరాటే సంబంధిత వ్యాయామాలు చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా తెలిపాడు పవన్. డైట్ విషయానికి వస్తే తాను పాటిస్తున్న సాత్విక్ డైట్ కూడా ఫిట్‌నెస్‌కి కారణంగా తెలిపారు పవర్ స్టార్. రోజుకి ఒక్కపూటే అన్నం తింటూ , మిగతా వేళలలో ఎక్కువగా ఫ్రూట్స్ తింటానని , ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలనే తాను ఇంకా ఫిట్‌గా కనిపిస్తున్నానంటూ పవన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతున్నారు. 'ఖుషి' దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

English summary
Pawan follows a strict Sathvik diet, which consists of having only one meal per day for six months in a year. To maintain the calorie intake, he eats a lot of fruits.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu