For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిల్క్, ఫ్రూట్స్ మీదే ఆధార పడ్డ పవన్ కళ్యాణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ‘గోపాల గోపాల'. ఈ చిత్రంలో ఆయన లార్డ్ శ్రీకృష్ణగా కనిపించబోతున్నారు. మరి దేవుడి అవతారంలో గత సినిమాలకు భిన్నంగా, ప్రత్యేకమైన లుక్‌తో కనిపించేందుకు పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ప్రత్యేకమైన డైట్ తీసుకుంటున్నారు. తన ఆహారంలో ఎక్కువగా పాలు, పండ్లు, తృణ ధాన్యాలు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట.

    ఇక గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాణ్ లుక్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేసిన వైట్ అండ్ వైట్ కాస్టూమ్స్ ధరించి కనబడతారు. ‘గోపాల గోపాల' విషయానికొస్తే...ఈ చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఎన్ఆర్ఏ బేసిస్ కింద రూ. 13.4 కోట్లకు ఆయన ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు.

    Pawan Kalyan followed a strict diet

    అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి(వెంకటేష్) దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

    English summary
    Post the success of his Gabbar Singh, Pawan Kalyan has followed a strict diet regimen. He has depended heavily on fruit diet and drinking milk is the only way for him to avoid carbs and pick those needed proteins.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X