»   » ఇక్కడ నమ్మకమే తక్కువ: కానీ పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుంటే...!

ఇక్కడ నమ్మకమే తక్కువ: కానీ పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుంటే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ రంగంలో నమ్మకం అనే మాట చాలా విలువైనది. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. హిట్టు, ప్లాపుల మీదే ఇక్కడి వారి మనుగడ ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శుకలు కూడా మాట నిలబెట్టుకోక పోవచ్చు. అందుకే ఇక్కడ నమ్మకం అనేది చాలా తక్కువ అని అంటుంటారు.

ఇతర హీరోలు, నిర్మాతల, దర్శకులు సంగతి ఎలా ఉన్నా.......పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం నమ్మకం అనేది కాస్త ఎక్కువే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే ఎప్పటికైనా తమకు మేలు జరుగుతుంది, ఆయన మాట ఇచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకుంటారు అని అంటుంటారు.

Also Read: డబ్బు, పేరు, టెన్షన్ ఫ్రీ: అందుకే పవన్‌ను వదిలేసి మహేష్ బాబు వైపు...!

తాజాగా కిషోర్ పార్థసాని(డాలీ) విషయంలో అది మరోసారి రుజువైంది. 'గోపాల గోపాల్' సినిమాకు పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేసిన డాలీకి అప్పుడు పవన్ కళ్యాణ్ ఓ మాట ఇచ్చారు. మీతో మరో సినిమా చేస్తానని చెప్పడంతో కొంత కాలంగా డాలీ పవన్ కళ్యాణ్ కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ తాజా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఎస్.జె.సూర్య తప్పుకోవడంతో... పవన్ కళ్యాణ్ ఇపుడు డాలీని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.

ఒక్క ఈ విషయంలోనే కాదు... నిర్మాతలైనా, డిస్ట్రిబ్యూటర్లయినా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికైనా, ఆయన సినిమాలు కొనడానికైనా ముందు ఉండటానికి కారణం పవన్ కళ్యాణ్ వారు నష్టపోకుండా తన బాధ్యత తీసుకుంటారనే నమ్మకమే. ఒక వేళ తన సినిమా వల్ల నష్టపోతే వారి నష్టాలు తీర్చడానికైనా మరో సినిమా చేస్తారు. అలాంటి మంచి క్యారెక్టర్ కాబట్టే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఒక మంచి అభిప్రాయం ఉంది అంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు.

ఆ నమ్మకంతోనే దాసరి..

ఆ నమ్మకంతోనే దాసరి..

పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతోనే దాసరి నారాయణ రావు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. త్వరలో ఆ సినిమా రాబోతోంది.

దిల్ రాజు

దిల్ రాజు

దిల్ రాజకు కూడా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. దిల్ రాజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం మంచి కథను సిద్ధం చేయించే పనిలో ఉన్నారు.

డిస్ట్రిబ్యూటర్లు

డిస్ట్రిబ్యూటర్లు

పవన్ కళ్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేయడానికి కారణం ఒక వేళ సినిమా ఆడక నష్టపోతే పవన్ కళ్యాణ్ తమను ఆదుకుంటారనే నమ్మకమే...

ప్రేక్షకులు..

ప్రేక్షకులు..

పవన్ కళ్యాణ్ గత సినిమాలు ప్లాపైనా ఆయన కొస్త సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఉత్సాహం, ఆయన సినిమాల్లో మినిమం ఎంటర్టెన్మెంట్ ఉంటుందనే నమ్మకమే అందుకు కారణం.

English summary
By now, everyone knows that S J Suryah is out of Pawan Kalyan’s project and Dolly has been replaced as the director of this much awaited film. If one can remember, during the time of Gopala Gopala, Pawan promised both Dolly and Anup Rubens that he would surely work with them for another film in the future. As promised, he has fulfilled what he said and stuck to his word.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu