పవర్ స్టార్ తలుచుకుంటే ఏ ఒక్కడికీ కునుకుండదు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పవర్ పుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పాత్ర ఎలా ఉంటుందటే.....నెత్తి మీద టోపీ ఉన్నంత వరకు అతను పోలీసే, ఒంటి మీద ఖాకీ ఉన్నంత వరకు అతను నీతి, నియమం, చట్టం ఇవన్నీ పాటించాలి. కానీ ఇవన్నీ పట్టుకుని వేలాడితే నేరస్తులు వారి రూట్లు వారు వెత్తుక్కుని జారుకుంటారు. అంతుకే అప్పుడప్పుడు తను పోలీస్ అనే విషయం మరిచి పోయి నేరస్తులను ఓ ఆట ఆడిస్తుంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో. ఈ సినిమాలో పవర్ స్టార్ తాను పోలీస్ అనే విషయం మరిచిపోయినంత కాలం నేరస్తులకు కునుకు ఉండదు. అదన్నమాట సినిమాలో ఉన్న అసలు మేటరు.
హారిష్ శంకర్ దర్శ కత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. పల్లెటూరి వాతావరణంలో ఇద్దరిపై పాటల చిత్రీకరణ సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం ఆడియో మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.
పంజా ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో...గబ్బర్ సింగ్ పై బోలెలు ఆశలు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. హిందీ సూపర్ హిట్ మూవీ దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోనూ దుమ్ము రేపవడం ఖాయమని, ఈ సినిమాతో పవర్ స్టార్ రేంజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











