3 సిటీల్లో గబ్బర్‌సింగ్ ఆడియో (అఫీషియల్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్ సింగ్' ఆడియో ఏప్రిల్ 15న సరికొత్త స్టయిల్‌లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'గబ్బర్ సింగ్' ఆడియో ఏప్రిల్ 15న సరికొత్త స్టయిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 15 ఉదయం పవన్ కళ్యాణ్ స్పెషల్ విమానంలో తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అభిమానుల్ని కలుసుకుంటారు. తర్వాత వైజాగ్, సింహాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకుని అక్కడ కూడా అభిమానులను కలుసుకుంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో 'గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్లో పాల్గొంటారు అని తెలిపారు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీభట్ల తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











