‘గబ్బర్ సింగ్’ కంప్లీట్స్ గ్రాండ్ 100 డేస్ (65 సెంటర్స్)
హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలోనే సంచలనం, రికార్డులన్నీ బద్దలు, నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చని సినిమా, గ్రాండ్‌గా 100 రోజులు పూర్తి చేసుకున్న చిత్రం....ఇదంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం గురించే అని ఇప్పటికే అర్థమయియ్యే ఉంటుంది.
గబ్బర్ సింగ్ చిత్రం నేటితో గ్రాండ్‌గా 100 రోజులు పూర్తి చేసుకుంది. రికార్డు స్థాయిలో 65 సెంటర్లలో ఈ పీట్ సాధించింది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు సనిమా చరిత్రలోనే ఈచిత్రం హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అన్ని విభాగాల్లోనే ఈచిత్రం సూపర్ అని టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన హిందీ 'దబాంగ్' చిత్రానికి రీమేక్ అయినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ భారీగా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈచిత్రాన్ని రూపొందించారు. పవర్ స్టార్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, మ్యానరిజానికి తోడు శృతి హీసన్ అందచందాలు, అభిమన్యుసింగ్ విలనీయం, కామెడీ సీన్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈచిత్రానికి ప్లస్సయ్యాయి.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











