అలా చేస్తే పవన్ కళ్యాణ్ పై లీగల్ యాక్షన్
తన సోదరుడు సల్మాన్ ఖాన్ హీరోగా అర్భాజ్ ఖాన్ హిందీలో 'దబాంగ్" చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తూ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నాడు. కానీ ఇటీవల బాలీవుడ్ మీడియాతో 'దబాంగ్" రీమేక్ హక్కులు ఎవ్వరికీ అమ్మలేదని అర్భాజ్ ఖాన్ ప్రకటించాడు. అలా ఎవరైన దబాంగ్ రీమేక్ అంటూ సినిమా తీస్తే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ నేపధ్యంలో హక్కులు సొంతమవ్వకుండా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఎలా ప్రకటించాడు అని టాలీవుడ్ లో చర్చలు సాగుతున్నాయి. వాస్తవానికి కామెడీ నటుడు, నిర్మాత గణేష్ బాబు ఈ హక్కలు కొని అనంతరం పవన్ కి ఇచ్చినట్టు వార్తలు ఉన్నాయి. కాబట్టి గణేష్ బాబు ఏదైనా యవ్వారం చేసి ఉంటాడని పలువురు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గణేష్ బాబు లవ్లీ దబాంగ్ అర్భాజ్ ఖాన్ pawan kalyan gabbar singh ganesh babu lovely dabangg arbaz khan


Click it and Unblock the Notifications