కోకాపేట్ విలన్ హౌస్ సెట్లో పవన్ కళ్యాణ్...!
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ను వీలయినంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ యూనిట్. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందే 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. నగర శివారులోని కోకాపేట్ లో వేసిన విలన్ హౌస్ సెట్లో ఈ నెల 9 నుంచి షూటింగు జరుపుతున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అభిమన్యు సింగ్ తదితరులు ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ డైరెక్షన్లో తాను చేస్తున్న సినిమా షూటింగు కంప్లీట్ చేశాక, పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' షూటింగులో పాల్గొంటారు.
హైదరాబాదులో కొంత వర్క్ చేశాక ఈ చిత్రం యూనిట్ పొల్లాచ్చి షిఫ్ట్ అవుతుంది. గతేడాది హిందీలో సూపర్ హిట్ అనిపించుకున్న 'దబాంగ్' సినిమాకు రీమేక్ గా ఈ 'గబ్బర్ సింగ్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, శృతి హాసన్ జంటగా నటించే ఈ చిత్రాన్ని హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











