పులి తర్వాత పద్దతి మార్చుకొన్న పవన్ కళ్యాణ్..!

By Sindhu

పవన్ కళ్యాణ్ హీరోగా హిందీలో హిట్టైన 'దబాంగ్‌' చిత్రాన్ని తెలుగులో 'గబ్బర్‌సింగ్‌'గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త పోస్టర్ ని ఈ మద్యనే విడుదల చేసారు. ఈ చిత్రంలో పొగరుమోతు పోలీసు అధికారి గా పవన్ కనిపించనున్నారు. చాలా కేర్ లెస్ గా కనిపించే మాస్ లుక్ తో ఉన్న క్యారెక్టర్ ని ప్రతిబింబించేలా ఈ స్క్రిప్టుని ని రూపొందించారు. 'మిరపకాయ్" వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్‌ శంకర్ 'గబ్బర్‌ సింగ్" చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు". పవన్ కళ్యాణ్ తన క్రొత్త చిత్రం 'గబ్బర్ సింగ్' లో 6 ప్యాక్ తో తనభిమానులు, తెలుగు ప్రేక్షకుల ఎదుటకు రానున్నాడు. ఈ మధ్యనే నిర్మాతగా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 సినిమాలు ఒప్పుకున్నాడు.

కొమరం పులి తర్వాత పద్దతి మార్చుకుని ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'కాళి" కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చింది. తమిళ డైరెక్టర్ విష్ణు వర్థన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ ఒక డిఫరెంట్ షేడ్ లో చూపించబోతున్నాడు. ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ డైరెక్షన్ లో గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రం షూటింగ్ ను కేరళలో ప్రారంభించాలని నిర్ణయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X