చిక్కుల్లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా చిక్కుల్లో పడింది. ఇప్పటికే బోలెడు క్రేజ్ సంపాదించిన ఈ సినిమా వస్తుందా, రాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాను గబ్బర్ సింగ్ పేరు మీద రీమేక్ చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. రఫాడించే ఫోజులతో పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ఇంతలో అనుకోని ఆటంకాలు వచ్చి పడ్డాయి. దబాంగ్ సినిమా గత రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టింది. దీంతో ఆ సినిమా హక్కుల కోసం తెలుగులో పోటీ పెరిగింది.
తన నిర్మాణ సంస్థ మీద దబాంగ్ రీమేక్‌కు హక్కుల సంపాదించినట్లు గణేష్ ఆ మధ్య ప్రకటించారు. ఇంతలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కింద తాను ఆ సినిమా తీయడానికి హక్కులు పొందినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ స్థితిలో తాను సినిమా రీమేక్ హక్కులు ఎవరికీ విక్రయించలేదని, ఎవరైనా ఈ సినిమాను రీమేక్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని దబాంగ్ సినిమా నిర్మాత హెచ్చరించారు. దీంతో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు చిక్కులు వచ్చి పడ్డాయి.


Click it and Unblock the Notifications