ఇండియాటుడే ఇంటర్వ్యూ: పర్సనల్ విషయాలపై పవన్ కళ్యాణ్ ఇలా!
హైదరాబాద్: ఏప్పుడో ఒకసారి అరుదుగా తప్ప అసలు మీడియాతో మాట్లాడని పవన్ కళ్యాణ్ ప్రముఖ నేషనల్ మేగజైన్ ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన కవర్ పేజీతో విడుదలైన ఇండియా టుడే స్పెషల్ ఇష్యూలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలు మీడియాలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆయన మూడో పెళ్లి వార్త ఓసెన్సేషన్. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ప్రతి నిధి ఆ విషయాల గురించి చెప్పాలని అడిగారు. అయితే పవన్ కళ్యాన్ తన పర్సనల్ విషయాల గురించి చెప్పడానికి నిరాకరించారు. పర్సనల్ విషయాలు పర్సనల్‌గా ఉండాలి. వాటిని బయటకు చెప్పడం నాకు ఇష్టం ఉండదు అని ఖరాకండిగా చెప్పేసారు.
స్లైడ్ షోలో పవన్ కళ్యాన్ చెప్పిన ఇతర విషయాలు...

మీ బ్రదర్స్‌తో మీ రిలేషన్ షిప్, విబేధాలు నిజమేనా?
మా అన్నయ్యలతో నాకు మంచి రిలేషన్ షిప్ ఉంది. మా పెద్దన్నయ్య నాకు గురువు లాంటి వారు. మరొక అన్నయ్య ఫ్రెండ్ లా ఉంటాడు. మా సిస్టర్స్ అంటే కూడా నాకు ఎంతో ఇష్టం అని పవన్ చెప్పారు.

మీరు ఎలాంటి దుస్తులు ఇష్టపడతారు
జీన్స్ వేయడానికి ఇష్టపడతాను. పంచె, దోవతి కూడా ఇష్టం. బట్టల విషయంలో పెద్దగా ఇంట్రస్టు చూపను అన్నారు.

మీరు ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతారు?
అన్నిరకాల బుక్స్ చదువుతాను. మా ఇల్లు చిన్నపాటి లైబ్రరీలా ఉంటుంది. నవలలు, ఇతర పుస్తకాలు అన్నిరకాల పుస్తకాలు చదువుతాను.

డాన్సులో నేను వీకే అని చెప్పిన పవన్
డాన్సులు చేయడంలో తాను వీకే అని పవన్ కళ్యాణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సెట్స్ లో ఎవరినీ డామినేట్ చేయడానికి ఇష్టపడనని వెల్లడించారు.

ఏ దర్శకులతో అయినా విబేధాలున్నాయా?
నా దర్శకులతో నేను ఇప్పటి వరకు ఇబ్బంది పడలేదు. అయితే స్క్రిప్టుకు అనుగుణంగా వారికి సూచనలు ఇష్తాను. బద్రి సినిమా సమయంలో అందులో యాక్షన్ సన్నివేశాలు లేకుండా అలాంటి పెట్టమని కోరాను అని తెలిపారు.

బంగారం డైరెక్టర్ ధరణితో విబేధాలు నిజమేనా?
అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఓ విషయంలో మేము సాధారణంగా ఓ విషయమై చర్చించుకున్నాం. కానీ అవి విబేధాలుగా ప్రచారం జరిగాయి.

హీరోయిన్‌ను ఏడిపిస్తే గుణపాఠం చెప్పా
తమ్ముడు సినిమా సమయంలో హీరోయిన్ ప్రీతిని కొందరు టీజింగ్ చేస్తూ తాను వారికి గుణపాఠం చెప్పినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











