Pawan Kalyan On Insta ఒక్క పోస్టు లేకుండానే పవర్ స్టార్ చరిత్ర.. ప్రభాస్, మహేష్, రాంచరణ్ రికార్డులు బ్రేక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సోషల్ మీడియాలో బలమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా అభిమానులు, ప్రజలతో మమేకమై ఉన్నారు. తనను అభిమానించే వారికి మరింత చేరువ కావడానికి తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లోకి వచ్చారు. ఇన్స్‌టాగ్రామ్‌లోకి వచ్చి రాగానే ఓ రికార్డును సొంతం చేసుకొన్నారు. అతి తక్కువ కాలంలో మిలియన్ వ్యూస్ సాధించిన ప్రముఖుల జాబితాలో పవన్ కల్యాణ్ చేరిపోవడం ఓ ఘనతగా అభిమానులు చెప్పుకొంటున్నారు. ఈ రికార్డు వివరాల్లోకి వెళితే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ చివరి వారంలో తన ఇన్స్‌టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు. ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో బ్లూ టిక్ కోసం అప్లై చేసుకొన్నారు. మంగళవారం బ్లూ టిక్ రావడంతో పవన్ కల్యాణ్ ఇన్స్‌టాగ్రామ్‌లోకి అధికారికంగా ప్రవేశించారు. ఈ మేరకు ఆయన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను అభిమానులకు, ప్రజలకు పరిచయం చేశారు.

Pawan Kalyan gets fastest 1 million followers in Instagram than Prabhas, Mahesh Babu, Ram Charan

ఇక పవన్ కల్యాణ్ ఓపెన్ చేసిన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఒక్క పోస్టు పెట్టలేదు. ఒక్క వీడియో పోస్టు చేయలేదు. ఆయన ఒకరిని ఫాలో కూడా కాలేదు. కానీ నిమిషాల్లోనే లక్షలాది మంది అభిమానులు ఫాలో కావడం రికార్డుగా మారింది. తెలుగు సినిమా హీరోల్లో పవన్ కల్యాణ్ అరుదైన ఘనతను సాధించారు.

పవన్ కల్యాణ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్స్ అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ కేవలం 380 నిమిషాల్లోనే అంటే 6 గంటల 20 నిమిషాల్లోనే సాధించడం రికార్డుగా మారింది. తెలుగులో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి వాళ్లకే ఈ రికార్డు సాధ్యపడలేదనే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Pawan Kalyan gets fastest 1 million followers in Instagram than Prabhas, Mahesh Babu, Ram Charan

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వివరాల ప్రకారం.. తెలుగు హీరోల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన వివరాల్లోకి వెళితే..ప్రభాస్ ఈ ఘనతను 23 రోజుల్లో సాధించారు. రాంచరణ్ 74 రోజుల్లో, మహేష్ బాబు 89 రోజుల్లో, అల్లు అర్జున్ 184 రోజుల్లో, ఎన్టీఆర్ 416 రోజుల్లో 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సాధించారు.

పవన్ కల్యాణ్ ఇన్స్‌టాగ్రామ్‌లోకి ప్రవేశించిన తర్వాత అభిమానులు కొన్ని విషయాలపై ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆయన మొదటగా ఎలాంటి పోస్టు పెడుతారు? ఆయన ఎలాంటి వీడియోను షేర్ చేస్తారు? ఆయన ఎవరిని మొదటగా ఫాలో అవుతారు? అనే విషయాలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X