పవన్ కళ్యాణ్ కి సుబ్బరాజు తలనొప్పి
పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'పంజా" అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టర్స్ లో చూసిన వారంతా క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు లాగ ఉన్నాడని, వెంటనే చూడగానే సుబ్బరాజు సినిమా అనుకున్నామని అంటున్నారు. దాంతో పవన్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఇక సంఘమిత్ర ఆర్ట్‌స-ఆర్కామీడియా వర్క్‌స సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. సారాజేన్ డయాస్, అంజలీ లావానియా కథానాయికలు. నిర్మాతలు నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ''టైటిల్ ఏమిటా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఇమేజ్ దృష్ట్యా పవర్‌ఫుల్ టైటిల్ నిర్ణయించాం.
కథానుసారం 'పంజా" ఖరారైంది. కోల్‌కత నేపథ్యంలోని యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. న్యూలుక్ ఉన్న సినిమా. క్రిష్, త్రీఇడియట్స్..చిత్రాలకు స్టంట్స్ కూర్చిన శ్యామ్ కౌశల్ అద్భుత యాక్షన్‌నిచ్చారు. 2పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు నడుస్తున్నాయి. దీపావళికి ట్రైలర్, నవంబర్‌లో ఆడియో, డిసెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం"" అన్నారు. ఇక పంజా చిత్రాన్ని రూపొందించిన విష్ణు వర్ధన్ గతంలో తమిళంలో భిళ్లా చిత్రం రూపొందించారు. ఆ చిత్రం రీమేక్ ప్రబాస్ తో చేసారు. కానీ తెలుగులో వర్కవుట్ కాలేదు. ఈ చిత్రం కూడా అజిత్ తో చేద్దామని ప్లాన్ చేసారు కానీ అజిత్ రిజెక్టు చేసినట్లు సమాచారం. మాఫియా డాన్ గా పవన్ కనిపించే ఈ చిత్రం భిళ్లా చిత్రానికి ప్రీక్వెల్ గా చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











