మెగాస్టార్ ఇంటికి పవర్‌స్టార్ నోరూరించే వేసవి బహుమతి
హైదరాబాద్ : పవర్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నోరూరించే వేసవి బహుమతి పంపించారు. ఆ బహుమతి మరేదో కాదు...నోరూరించే తాజా మామిడి పండ్లు. ఇవి ఎక్కడో బయట కొని తీసుకొచ్చినవి కాదు... పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సొంత తోటలో పండించిన అమృత ఫలాలు.
పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం...పవన్ ప్రస్తుతం తన తోటలో గడుపుతున్నాడని, తన సన్నిహితులకు రకరకాల జాతులకు చెందిన మామిడి పండ్లు పంపుతున్నాడని తెలుస్తోంది. గత సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' యూనిట్ సభ్యులందరికీ మామిడిపండ్లను బహుమతిగా వారి ఇంటికి పంపిన సంగతి తెలసిందే.
ప్రస్తుతం పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత 'గబ్బర్ సింగ్ -2' చిత్రం తెరకెక్కనుంది.
'గబ్బర్ సింగ్ -2' చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర తారాగణం విషయాలు వెల్లడికానున్నాయి. ఐపీఎల్ యాంకర్ రాచెల్లే రావుతో ఇందులో ఐటం సాంగు చేయిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












