పవన్ కల్యాణ్ జెట్ స్పీడ్.. తెరపైకి PSPK31.. దర్శకుడు ఎవరంటే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకొన్నారు. వకీల్ సాబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆలస్యమైనప్పటికీ.. లేటేస్ట్‌గా ఇండస్ట్రీకి హిట్ అందించి కరోనాతో కుదేలైన సినీ పరిశ్రమకు ఊరట కలిగించారు.

వకీల్ సాబ్ సినిమా తర్వాత వరుస సినిమాలతో విజృంభిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను తన కెరీర్‌లో 27వ చిత్రంగా మార్చారు. అలాగే PSPK28గా మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ రూపొందుతున్నది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని PSPK29గా మైత్రీ మూవీస్ రూపొందిస్తున్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే సినిమా PSPK30గా వ్యవహరిస్తున్నారు.
ఇలా రెండేళ్లపాటు బిజీగా మారిపోయిన పవన్ కల్యాణ్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. గతంలో నిర్మాతలు జే పుల్లారావు, భగవాన్ నుంచి పవన్ కల్యాణ్ మూడేళ్ల క్రితం అడ్వాన్స్ తీసుకొన్నారు. ఆ అడ్వాన్స్ నేపథ్యంలో 2022లో సినిమాను చేసేందుకు పవన్ కల్యాణ్ కాల్సిట్ ఇచ్చారని తెలిసింది. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయాన్ని నిర్మాతలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు.


Click it and Unblock the Notifications