జూ ఎన్టీఆర్ డైరెక్టర్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్....!
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉందని పబ్లిక్ ఫంక్షన్స్ లో వివి వినాయక్ చాలా సార్లు తన కోరికను వెలిబుచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లో ఒకరైన వివి వినాయక్ ని ఎప్పుడూ కన్సిడర్ కాలేదు. అయితే తన పరాజయాల పరంపరకి డైరెక్టర్స్ ఛాయిస్ కూడా ఒక కారణమని ఫీడ్ బ్యాక్ వస్తూ ఉండడంతో ఇకపై తను వర్క చేసే దర్శకుల విషయంలోనూ కేర్ తీసుకోవాలని పవన్ భావిస్తున్నాడు.
అందుకే చాలా కాలంగా తనతో సినిమా చేయాలని అనుకుంటోన్న వినాయక్ తో వర్క్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డివివి దానయ్య నిర్మాణంలో వినాయక్ దర్శకత్వంలో త్వరలోనే పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'బద్రీనాథ్" చేస్తున్న వినాయక్, సైమల్టేనియస్ గా పవన్ కోసం ఒక స్ర్కిప్ట్ రెడీ చేయిస్తున్నాడు. అది రెడీ కాగానే పవన్, వినాయక్ ల చిత్రం సెట్స్ మీదకు వెళుతుంది.
పవన్ కళ్యాణ్ ఇకపై వాయువేగంతో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నాన్చే దర్శకులతో త్వరగా పని కానిచ్చే డైరెక్టర్స్ తోనే వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు. జయంత్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా డిసెంబర్ ఎండ్ కి పూర్తయిపోతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











