స్పెయిన్ లో పవన్ కళ్యాణ్ ఇదిగో ఇలా..(ఫోటో)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్పెయిన లో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అక్కుడ కొన్ని పాటలు, కీలకమైన సీన్స్ షూట్ చేసుకుని వస్తారని వినికిడి. అక్కడ వచ్చే సీన్స్ లో పవన్ ఈ గెటప్ లో ఉండనున్నారు. అలాగే ఇక్కడ షూటింగ్ పూర్తయ్యాక..మరో ఇరవైరోజులు పాటు యూరప్ వెళ్లనున్నారు.
స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, ఇతర యూరోపియన్ కంట్రీలలో షూటింగ్ జరుపనున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశంలో ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని సమాచారం. ఇక ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే... అధికారికంగా మాత్రం ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదు.
మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'


Click it and Unblock the Notifications












