క్రీస్తు పుట్టిన ప్రదేశం జెరూసలేంకి పవన్ కళ్యాణ్ ప్రయాణం
ఇజ్రాయిల్ లోని జెరూసలేంలోని చారిత్రక ప్రదేశం మౌంట్ ఆఫ్ ఆలివ్స్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రం షూటింగ్ జరుగుతోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా రూపొందనుంది. ఈ షూటింగ్ ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తిగా బాలనటీనటులుతో రూపొందే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ది కీలకపాత్ర అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆదిత్య ప్రొడక్షన్స్ పై కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...ఇజ్రాయెల్ లోని చారిత్రాత్మక ప్రదేశాల్లో చిత్రీకరణ ఉంటుంది. పవన్ కల్యాణ్ పై ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. జెరూసలేంలోని మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర చిత్రీకరణ చేసే సందర్భంలో ఈ కథాంశం ఏమిటన్నది ప్రసార మాధ్యమాల ద్వారా వెల్లడిస్తామన్నారు. ఇక ఈ చిత్రానికి రచన: జె.కె.భారవి, ఛాయాగ్రహణం: శేఖర్ వి.జోసెఫ్. అలాగే ఈ చిత్రం ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలాగే ఈ చిత్రం టైటిల్ 'క్రైస్ట్' గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











