షాకింగ్ న్యూస్: సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ పెడుతున్నాడని అభిమానుల సంతోషంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తనను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని, ప్రజలకు ఏదైనా చేయడానికే రాజకీయ పార్టీ పెడుతున్నానని, సినిమాలపై ఇక ఆసక్తి లేదని, ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని, ఇక ప్రజా సేవకే అంకితం అవుతానని స్పష్టం చేసారు.

Pawan Kalyan

ఆయన వ్యాఖ్యలు బట్టి....ప్రస్తుతం ఆయన కమిటైన 'గబ్బర్ సింగ్-2' చిత్రంతోపాటు....హిందీ మూవీ 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా వస్తున్న తెలుగు చిత్రంలో మాత్రమే నటిస్తారని స్పష్టమవుతోంది. గబ్బర్ సింగ్-2 చిత్రం షూటింగ్ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మరి 'ఓ మై గాడ్' తెలుగు రీమేక్‌లో నటిస్తాడో? లేదో? సందేహమే.

ఇక పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో ఎవరినీ వదలలేదు. సోనియా, రాహుల్, కాంగ్రెస్ హై కమాండ్, కేసీఆర్, కవిత, కెటి రామారావు ఇలా తనపై విమర్శలు చేసిన వారందిరనీ టార్గెట్ చేసారు. అన్నయ్యను ఎదురించాలని తనకు లేదని, కాంగ్రెస్ హైకమాండ్ చర్యల వల్లే ఇలా చేయాల్సి వస్తుందని అన్నారు.

ఇక ఆయన ప్రసంగంలో ఎక్కువ శాతం రాష్ట్ర విభజన అంశాలే ఉండటం గమనార్హం. దీంతో పాటు ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యలపై మాట్లాడారు. అధికారం కోసం తాను పార్టీ పెట్టలేదని, ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X