'యువరాజ్యం'లో పవన్ ఉండడా?

ఆస్రా నిర్మాణ్ పతాకంపై హారూన్.హెచ్.ఎస్.నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి వీరశంకర్ మాట్లాడుతూ సమకాలీన ఇతివృత్తంతో కథను సిద్ధం చేశాం. భారతీయ యువతకు ఏసీల కన్నా పైర గాలి బాగా తెలుసు. ఫ్రిజ్‌లోని నీళ్ల కన్నా కుండ నీళ్ళ చల్లదనం బాగా పరిచయం. అలాంటిది వారి మూలాలకు భంగం కలిగితే?..అప్పుడు యువత ఎలా స్పందిస్తుంది? వారి పోరాటం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలతో మొదలవుతుంది. బూమ్ అనేది బుడగలా పేలినా...భూమి అనేది మనకు శాశ్వతం అని అంతర్లీనంగా చెబుతాం. ఈ నెల 27 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది. మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
ఇంతకుముందు ఈ విషయమై వీరశంకర్ మాట్లాడుతూ...మెడికల్ కాలేజీలు..డాక్టర్స్ ని తయారు చేస్తూంటాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీర్స్ ని తయారు చేస్తాయి..లా కాలేజీలు న్యాయవాదులను తయారు చేస్తాయి. అయితే యువరాజ్యం ఎవర్ని తయారు చేస్తుంది.రాజకీయనాయకులనా లేక యువజన నాయకులనా లేక సమాజానికి ఉపయోగపడే సర్వీస్ వాలంటీర్స్ నా అనేది నా సినిమా చెబుతుంది. త్వరలో ఈ సినిమాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణులు వంటి విషయాలు తెలియచేస్తామంటున్నారాయన.


Click it and Unblock the Notifications











