'రక్త చరిత్ర 2’ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ...!
'రక్త చరిత్ర 2" చూసి ఎవరు సంబరిపడినా పడకపోయినా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'రక్తచరిత్ర" లో వివివేక్ ఒబెరాయ్ ఒకడికి గుండు కొట్టిస్తున్న స్టిల్ బయటకు వచ్చింది. అంతే సరి అది పవన్ కళ్యాణ్ గుండేమోనని మెగా అభిమానులు గుండెలు బాదేసుకున్నారు. ఏదో ఒక పుకారుని పట్టుకుని రామ్ గోపాల్ వర్మ ఒక సినిమాలో సీన్ పెట్టేంతే తెగిస్తాడా అంటూ ఫ్యాన్స్ కల్లోలానికి గురయ్యారు. నిజంగా ఆ సీన్ సినిమాలో ఉంటే తమ మీరో పరువేమి కావాలంటూ లబోదిబోమన్నారు. కొందరయితే వీరావేశంతో రామ్ గోపాల్ వర్మ అందుబాటులో ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వారికి వారికి నచ్చిన భాషల్లో పాండిత్యమంతా ప్రదర్శించారు. అయితే వర్మ వాళ్లందరినీ కనికరించాడు. ఫనల్ కట్ లో ఆ సీన్ లేకుండా కట్ చేశాడు. ఎన్టీఆర్ నే అంత రక్తి కంటించినోడికి పవన్ కళ్యాణ్ గురించి సీన్ పెట్టడమొక లెక్కా? పోనీలెండి ఈసారికి కనికరించి వదిలేశాడు.


Click it and Unblock the Notifications











