Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చాలా కాలం తరువాత జిమ్లో పవన్ కళ్యాణ్ కసరత్తులు.. ఆ సినిమా కోసమే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బిగ్ స్క్రీన్ పై చూసి చాలా కాలమయ్యింది. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా మార్కెట్ ఇంకా పెరుగుతూనే ఉంది. మొత్తానికి వకీల్ సాబ్ విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఇక త్వరలో పవన్ సరికొత్త ఫీట్నెస్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
వకీల్ సాబ్ తరువాత
వకీల్ సాబ్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమాలో రానా మరో పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు కోసం కేవలం 40రోజుల కాల్షీట్స్ ఇస్తున్న పవన్ వీలైనంత త్వరగా ఇక క్రిష్ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఆ సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
కాంప్రమైజ్ అవ్వడం లేదు..
అప్పట్లో క్రిష్ సినిమా కోసం పవన్ కోర మీసాలు పొడవు జుట్టు కూడా పెంచాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ప్లాన్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. ఇక పవన్ వకీల్ సాబ్ కోసం లుక్ కూడా మార్చల్సి వచ్చింది. లేకుంటే ఈపాటికె ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేది. వెంటవెంటనే సినిమాలు చేయడం కాస్త ఒత్తిడితో కూడిన పనే అయినప్పటికీ పవన్ లుక్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు.
స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో..
క్రిష్ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి కాస్త ఫిట్నెస్ లో కూడా మార్పులు చేయాలని అనుకుంటున్నారట. పవన్ తన కెరీర్ లో ఎప్పుడు కూడా ఇలాంటి రోల్స్ చేయలేదు. అందుకే కొత్తగా ఉండాలని చాలా గ్యాప్ తరువాత స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. పవన్ ఇన్నాళ్లు రెగ్యులర్ వ్యాయామలతోనే ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ వచ్చాడు.
నెవర్ బిఫోర్ అనేలా కనిపించాలని..
ఇక క్రిష్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా కనిపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వర్కౌట్స్ చేసిన ఫొటోలను ఏ మాత్రం లీక్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఇక క్రిష్ సినిమాకు సంబంధించిన టైటిల్స్ పై రకరకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. విరూపాక్ష, శివం, గజదొంగ, హర హర మహాదేవ్, బందిపోటు వంటి పేర్లు వినిపించాయి.
టైటిల్ లో మార్పులు
ఈ మూవీకి హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చింది. కానీ ఆ టైటిల్ విషయంలో కూడా చిన్నపాటి మార్పులు చేస్తారని తెలుస్తోంది. కేవలం 'వీరమల్లు' అని టైటిల్ ను ఫిక్స్ చేయవచ్చని రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో..