Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ మీద సర్ ప్రైజ్ తో మెగా ట్రీట్! ఫొటోలు వైరల్

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా పవన్ కల్యాణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. అంచెలంచలుగా ఎదిగి టాలీవుడ్‌లో పవర్ స్టార్ అనే బ్రాండ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన నుంచి సినిమాలు, వచ్చిన, పోస్టర్లు విడుదలైన సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా విడుదలైల హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ టీజరే. పవన్ కల్యాణ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తూ మెగా ట్రీట్ ఇస్తోంది హరిహర వీరమల్లు చిత్రబృందం. ఆ వివరాళ్లోకి వెళితే..

 సినిమా సినిమాకు క్రేజ్..

సినిమా సినిమాకు క్రేజ్..

తెలుగు రాష్ట్రాల్లో పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్​లు ఫ్లాప్​లు అంటూ తేడా లేకుండా ఏమాత్రం క్రేజ్​ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్​ కల్యాణ్​ అనే చెప్పవచ్చు. సినిమా సినిమాకు క్రేజ్​ పెంచుకుంటూ పోయే పవన్​ కల్యాణ్​ కొత్త మూవీ వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.

రెట్టించిన ఉత్సాహంతో..

రెట్టించిన ఉత్సాహంతో..

ఇటీవల పవన్ కల్యాణ్.. వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. వాటన్నింటికి అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పవన్ కల్యాణ్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఈ మెగా హీరో ఎన్నో చిత్రాలను కూడా మొదలు పెట్టేశాడు.

వజ్రాల దొంగగా..

వజ్రాల దొంగగా..

అందులో ఒకటి హరిహర వీరమల్లు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో ఈ పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే 60 శాతం పూర్తి..

ఇప్పటికే 60 శాతం పూర్తి..

ఇదిలా ఉంటే ఆ మధ్య అనేక కారణాలతో సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను అక్టోబర్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్ డేట్ ను శుక్రవారం షెడ్యూల్ వర్క్ షాప్ పేరిట వీడియో విడుదల చేశారు.

రెండో రోజు వర్క్ షాప్ ఫొటోలు..

రెండో రోజు వర్క్ షాప్ ఫొటోలు..

ఈ వీడియోలో పవన్ డైలాగ్ చెప్పడం, తదిర విషయాలను క్రిష్ జాగర్లమూడితో చర్చించడం తదితర అంశాలను చూడొచ్చు. అయితే తాజాగా హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ కు సంబంధించిన రెండో రోజు వర్క్ షాప్ ఫొటోలను రిలీజ్ చేశారు. చిత్రబృందంతో పవన్ కల్యాణ్ మాట్లాడటం, సీన్లు చూపించడం, ల్యాప్ టాప్ లో పలు విషయాలను వివరించడం వంటివి ఆసక్తిగా ఉన్నాయి.

 అభిమానులుకు సర్ ప్రైజ్..

అభిమానులుకు సర్ ప్రైజ్..

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్ డేట్స్ ను రోజు ఇస్తూ పవన్ కల్యాణ్ అభిమానులుకు సర్ ప్రైజ్ మీద సర్ ప్రైజ్ లు ఇస్తూ మెగా ట్రీట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

భారీ బడ్జెట్ లో..

భారీ బడ్జెట్ లో..

ఇదిలా ఉంటే 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారనే ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X