పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

By Srikanya

షాక్ దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్నారు. ఆయన ఈ చిత్రం విశేషాలు మీడియాకు వివరించారు. గణేష్‌ బాబు మాట్లాడుతూ- "పవర్‌ స్టార్‌తో చేయనున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తుంది. పక్కా స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. అద్భుతమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. ఇది ఓ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారు.

గతంలో పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌హిట్‌ చిత్రానికి సంగీతం చేసిన యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తారు. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో ఓ సంచలన విజయం సాధించిన చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన టాప్‌ టెక్నీషియన్‌ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందిస్తారు. ఓ ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ పవన్‌కళ్యాణ్‌తో తొలిసారి చేయబోతున్నారు. సాంకేతికపరంగా అత్యున్నతస్థాయిలో నిర్మితమయ్యే ఈ చిత్రం పవర్‌స్టార్‌ కెరీర్‌లో సంచలనాత్మక చిత్రం అవుతుందని నమ్మకంతో చెబుతున్నాను.

మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అని తెలిపారు. డిసెంబరులో షూటింగ్‌ ముహూర్తం జరుగుతుందని, జనవరి, ఫిబ్రవరి నెలల్లో షెడ్యూల్‌ స్టార్ట్‌ అయి ఏకధాటిగా షూటింగ్‌ జరుపుకుంటుందని సమర్పకుడు బడే రవి చెప్పారు. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది చెప్పారు. ఇక పవన్ కళ్యాన్ ప్రస్తుతం పులి టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X